Translate

జాతక దోషాలు --- ప్రాణాయామ పద్ధతుల ద్వారా నివారణ



జాతక దోషాలు --- ప్రాణాయామ పద్ధతుల ద్వారా నివారణ



జాతక దోషములు సాధారణంగా ఈ క్రింద విధముగా ఉంటాయి.


1) గురుదోషము  వలన వివాహ విషయంలోనూ,  విద్యా విషయంలోనూ సమస్యలు రావచ్చును.  దానికి ఏమాత్రము క్రుంగిపోవలసిన అవసరము లేదు.  ఇక్కడ గ్రహ గురువు కంటే సద్గురువు సలహాతో స్వాధిష్ఠానచక్రమును టెన్స్ చేసి ఆచక్రములో వం అనే  బీజాక్షరధ్యానము, ఫిజన్ మరియు ఫ్యూజన్    పద్ధతుల ప్రాణాయామ పద్ధతుల ద్వారానూ , దీర్ఘప్రాణాయామ పద్ధతుల ద్వారానూ ఆ లోపమును సమూలముగా నిర్మూలించవచ్చు.

2) శుక్ర దోషము  వలన సంతానలోపము, సంసారములో కలతలు కలహములూ, వీర్య లోపములు రావచ్చును. దానికి ఏమాత్రము క్రుంగిపోవలసిన అవసరము లేదు.  ఇక్కడ  సద్గురువు సలహాతో విశుద్ధ చక్రమును టెన్స్ చేసి ఆచక్రములో హం  అనే  బీజాక్షరధ్యానము, ఫిజన్ మరియు ఫ్యూజన్    పద్ధతుల ప్రాణాయామ పద్ధతుల ద్వారానూ , దీర్ఘప్రాణాయామ పద్ధతుల ద్వారానూ ఆ లోపమును సమూలముగా నిర్మూలించవచ్చు.

సూర్యుడు కోడిగుడ్డు (elliptical order) ఆకారముగా తిరుగుతూ ఉంటాడు.  కనుక ఆయన దూరముగా ఉన్నపుడు  చలికాలం, దూరముగా ఉన్నప్పుడు ఎండాకాలం అవుతుంది. పుడమితల్లికి సూర్యుని దూరము మరియు దిశను బట్టి ఎండ, వాన, చలి కాలములు ఏర్పడుతాయి. 

జన్మసమయములో సూర్యుడు ఏ ఇంటికి అనగా ఏ రాశికి దగ్గిరగా ఉంటాడో అది జన్మ లగ్నరాశి అవుతుంది.  ఆజన్మ సమయములో మనిషి మీద  లగ్నరాశి యొక్క మరియు లగ్నరాశికి ఇరుప్రక్కలా ఇళ్ళలో(రాశులలో) ఉన్న గ్రహముల ప్రభావము మనిషి మీద తప్పక ఉంటుంది.

సూర్య కిరణములు భూమిని తాకటానికి ఎనిమిది నిమిషములు పడుతుంది. మనిషి జన్మసమయములో ఉండేస్థలమును బట్టి సూర్య కిరణములు కొంతమంది విషయంలోముందుగా, కొంతమంది విషయంలో తరువాత చేరుతూఉంటాయి.  అది సెకండ్లో  వందోవంతో వెయ్యోవంతో అవ్వచ్చు.  కాని ఆవ్యత్యాసమే మనిషి అదృష్టం నిర్ణయిస్తుంది.  కనుక మనిషి పుట్టిన స్థలము, సమయము గ్రహస్థితిని నిర్ణయించటము, ఆ  గ్రహస్థితి మనకి కర్మ ప్రకారము ఫలితాలు నిర్దేశించటమూ జరుగుతుంది.

3) చంద్రదోషము: చంద్రదోషము  వలన మానసికంగాను,  వాణిజ్యపరంగానూ, ఉద్యోగపరంగానూ  సమస్యలు రావచ్చును.  దానికి ఏమాత్రము క్రుంగిపోవలసిన అవసరము లేదు.  ఇక్కడ సద్గురువు సలహాతో అనాహత చక్రమును టెన్స్ చేసి ఆచక్రములో యమ్ అనే  బీజాక్షరధ్యానము, ఫిజన్ మరియు ఫ్యూజన్    పద్ధతుల ప్రాణాయామ పద్ధతుల ద్వారానూ , దీర్ఘప్రాణాయామ పద్ధతుల ద్వారానూ ఆ లోపమును సమూలముగా నిర్మూలించవచ్చు. 

4) శని దోషము:  శనిదోషము  వలన .దరిద్రము, ఇంటిపోరు, కష్టాలు ,మానహాని, వ్యవహార చిక్కులు కలుగును. దానికి ఏమాత్రము క్రుంగిపోవలసిన అవసరము లేదు.  ఇక్కడ  సద్గురువు సలహాతో మూలాధార చక్రమును టెన్స్ చేసి ఆచక్రములో లం  అనే  బీజాక్షరధ్యానము, ఫిజన్ మరియు ఫ్యూజన్    పద్ధతుల ప్రాణాయామ పద్ధతుల ద్వారానూ , దీర్ఘప్రాణాయామ పద్ధతుల ద్వారానూ ఆ లోపమును సమూలముగా నిర్మూలించవచ్చు.

5) కుజదోషం:   శతృవుల వలననూ, స్వయంకృతాపరాధము వలనను  చిక్కులు కలుగును.  దానికి ఏమాత్రము క్రుంగిపోవలసిన అవసరము లేదు.  ఇక్కడ  సద్గురువు సలహాతో మణిపుర చక్రమును టెన్స్ చేసి ఆచక్రములో రమ్  అనే  బీజాక్షరధ్యానము, ఫిజన్ మరియు ఫ్యూజన్    పద్ధతుల ప్రాణాయామ పద్ధతుల ద్వారానూ , దీర్ఘప్రాణాయామ పద్ధతుల ద్వారానూ ఆ లోపమును సమూలముగా నిర్మూలించవచ్చు.

6) బుధదోషం : వ్యాపారపరంగానూ, వాచాలత వలననూ , విద్యాపరమైన చిక్కులు కలుగును.. సద్గురువు సలహాతో అజ్ఞా  చక్రమును టెన్స్ చేసి ఆచక్రములో ఓమ్   అనే  బీజాక్షరధ్యానము, ఫిజన్ మరియు ఫ్యూజన్ పద్ధతుల ప్రాణాయామ పద్ధతుల ద్వారానూ , దీర్ఘప్రాణాయామ పద్ధతుల ద్వారానూ ఆ లోపమును సమూలముగా నిర్మూలించవచ్చు.

7) రవిదోషం:  విద్య, ఆధ్యాత్మిక న్యూనత లేక శూన్యత, ఆర్ధిక పరమైన చిక్కులు కలుగును.. సద్గురువు సలహాతో సహస్రార   చక్రమును టెన్స్ చేసి ఆచక్రములో రామ్   అనే  బీజాక్షరధ్యానము, ఫిజన్ మరియు ఫ్యూజన్ పద్ధతుల ప్రాణాయామ పద్ధతుల ద్వారానూ , దీర్ఘప్రాణాయామ పద్ధతుల ద్వారానూ ఆ లోపమును సమూలముగా నిర్మూలించవచ్చు.




నవగ్రహస్తోత్రము

సప్తాశ్వరధమారూఢం  ప్రచండం కశ్యపాత్మజమ్
శ్వేతపద్మధరమ్ దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్

ఏడుగుఱ్ఱములను (ఏడుచక్రములు) అధిరోహించువాడును, ప్రచండమైన కాంతిగలవాడును అనగా ఆజ్ఞానమును దూరము చేయువాడునూ, కశ్యప మహర్షి కుమారుడును అనగా శుద్ధ బుద్ధి ప్రదాతయూ, తెల్లనిపద్మమును ధరించినవాడును అనగా జ్ఞానమునకు ప్రతీకుడునూ అయిన సూర్యదేవునికి నమస్కరిస్తున్నాను.
ఇక్కడ సప్తాశ్వరధమారూఢం అనగా మూలాధారము నుండి సహస్రారము వరకున్న ఏడు చక్రములను అనగా ఏడులోకములను ప్రకాశవంతముచేసి జ్ఞానవంతము చేసేవాడు అని అర్థము.  రవి ఆత్మకు ప్రతీక.


శ్వేతాశ్వ సమారూఢం కేయూర మకుటోజ్వలం
జటాధర శిరోరత్నం తం చంద్రం  ప్రణమామ్యహమ్

తెల్లని గుఱ్ఱమును అధిరోహించువాడును, కేయూరకాంతులు వెదజల్లువాడును, పరమశివుని శిరమున అలంకారముగా ఉన్నవాడును  అయిన  చంద్రదేవునికి నమస్కరిస్తున్నాను.
ఇక్కడ శ్వేతాశ్వ సమారూఢం అనగా బుద్ధికి , జటాధర శిరోరత్నం అనగా మనసుకి అధినేత అని అర్థము.. అనగా పరమశివుడు  మనసు, బుద్ధి రెండింటిని తన ఆధీనములో ఉంచుకున్నవాడు  అని అర్థము. అందువలన శివుని శిరమున అలంకారప్రాయముగా చంద్రుని చూపుతారు.


ధరణీగర్భ సంభూతం విద్యుత్ కాంతి సమాప్రభం
కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహమ్

భూదేవి గర్భమున జన్మించినవాడును, విద్యుత్ కాంతితో సమానమైన ప్రభ అనగా కాంతి గలవాడును, యవ్వనవంతుడు, శక్తివంతుడునూ, మంగళప్రదుడునూ, అయిన  కుజ(మంగళ) దేవునికి నమస్కరిస్తున్నాను.


ప్రియంగు కళికా శ్యామం రూపేణ ప్రతిమం బుధం
సౌమ్యం సౌమ్యగుణో పేతం తం బుధం ప్రణమామ్యహమ్

ప్రియమైన శ్యామ వర్ణము గలవాడును, అందమైనవాడును, సౌమ్యుడునూ, అయిన  బుధ దేవునికి నమస్కరిస్తున్నాను. బుధుడు వ్యాపారమునకు సంబంధించిననవాడు. దానిని సాధకుడు ఆధ్యాత్మిక వ్యాపారమునకు అనగా ఆధ్యాత్మికప్రగతికి అనుకూలించుకొనుటకు ఆయనని ప్రార్థించవలెను.


దేవానాంచ ఋషీణాంచ గురుకాంచన సన్నిభం
బుద్ధిపూతం త్రిలోకేశం తం గురుం  ప్రణమామ్యహమ్

దేవతలకు ఋషులకు బంగారము అనగా  గొప్ప గురువునూ, బుద్ధిమంతుడునూ, త్రిలోకపూజితుడునూ , అయిన  గురు దేవునికి నమస్కరిస్తున్నాను.  గురువు సాత్వికగుణమునకు, జ్ఞానము, వేదాంతం, విద్య మరియు సుఖమునకు ప్రతీక.


హిమకుండమృణాలాభం దైత్యానాం పరమం గురుం
సర్వశాస్త్ర ప్రవక్తానాం తం శుక్రం ప్రణమామ్యహమ్

తెల్లని వాడునూ, రాక్షసులకు గురువునూ, సర్వశాస్త్రకోవిదుడు అయినప్పటికీ  అహంకారముతో కూడి సంసారబంధమోహము కలగజేయువాడునూ, వీర్యమునకు ప్రతీక అయిన శుక్ర దేవునికి నమస్కరిస్తున్నాను.  సంసారము(నీరు)లో నావ (మనిషి) ఉండవచ్చు. నావ (మనిషి) లో నీరు(సంసారము) ఉండరాదు. దీనినే సంసారబంధమోహము అంటారు. 


నీలాంజన సమాభూతం రవిపుత్రం యమాగ్రజం
ఛాయా మార్తాండ సంభూతం తం శనిం  ప్రణమామ్యహమ్

నల్లనివాడునూ, రవికి కుమారుడునూ, యమునికి అన్నయ్యనూ, ఛాయాదేవికి (అజ్ఞానం) రవికి (పరమాత్మ చైతన్యము) పుత్రుడునూ అయిన శనిదేవునికి నమస్కరిస్తున్నాను. మల, విక్షేప, ఆవరణ దోషములవలన  పరమాత్మచైతన్యమును  గుర్తించని జ్ఞానమునే , ఛాయా మార్తాండ సంభూతం అయిన ఆజ్ఞానము.  శని తామసగుణమునకు ప్రతీక. అందువలన దుఃఖదుడు.


అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనం
సింహికాగర్భ సంభూతం తం రాహుం  ప్రణమామ్యహమ్

అర్థ శరీరము గలవాడునూ,  మహావీరుడునూ, చంద్ర అనగా మనస్సును  మరియు రవిని అనగా ఆత్మను (బుద్ధిని)  పీడించువాడునూ, సింహిక అనగా మనస్సు. అహంకారముతో కూడినవాడునూ  అయిన రాహు దేవునికి నమస్కరిస్తున్నాను.  


ఫలాశ పుష్ప సంకాశం తారకాగ్రహ మస్తకం
రౌద్రం  రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహమ్

మోదుగ పుష్పకాంతి గలవాడునూ, నక్షత్రములకు మరియు గ్రహములకు తలపై నుండు వాడునూ,  రౌద్ర స్వభావము గాలవాడునూ, రుద్రుని కుమారుడునూ అనగా తామస స్వభావుడునూ, ఘోరమయినవాడునూ, అయిన కేతుదేవునికి నమస్కరిస్తున్నాను.

ఒక్కొక్క చక్రము ఒక్కొక్క గ్రహమునకు ప్రతీక. రాహు కేతువులు ఛాయాగ్రహములు.  కనుక వాటికి ప్రత్యేక స్థానములు ఇవ్వలేదు. 

సహస్రారము--------రవి
ఆజ్ఞా ----------------బుధ
విశుద్ధ -------------శుక్ర
చంద్ర---------------అనాహత
కుజ---------------మణిపుర
గురు--------------స్వాధిస్ఠానం
శని----------------మూలాధారం

మన శరీరములో 72,000 సూక్ష్మనాడులున్నవి. వాటిలో 3 సూక్ష్మనాడులు ముఖ్యమైనవి. అవి ఇడ, పింగళ మరియు సుషుమ్న అనేవి. ఇడ మేరుదండములో ఎడమవైపున, పింగళ మేరుదండములో కుడి వైపున మరియు సుషుమ్న మేరుదండములో ఇడ, పింగళ మధ్యన ఉండును.  మూలాధారం నుండి ఇడ, పింగళ మరియు సుషుమ్న అనేవి ఆజ్ఞావరకు కలిసి ఉంటాయి. ఆజ్ఞాచక్రము నుండి సహస్రారము వరకు సుషుమ్నమాత్రమె ముందుకు సాగును.  ఇడ  నకారాత్మక్రియలకు (negative)   పింగళ సకారాత్మ క్రియలకు(positive)  మరియు చ తటస్థ క్రియలకు (neutral).  ప్రతీకలు. సాధకుని లక్ష్యము మూలాధారచక్రము క్రింద ఉన్న కుండలినీ శక్తిని తన సాధనతో  సుషుమ్నద్వారా సహస్రారమునాకు చేర్చుట.  అందుకు విరుద్ధంగా ఇడ వైపు గానీ, , పింగళ వైపు గానీ కుండలినీ శక్తిని పంపగూడదు. పంపినయడల విపరీత స్వభావమును ధ్యానసమయమున పొందును. ఉదాహరణకి అనాహతలో ఇడ వైపు కుండలినీ శక్తి నడిచిన ద్వేషము, పింగళ వైపు నడిచిన అతిప్రేమ(మోహము) కలుగును.  అదే కుండలినీ శక్తిని సుషుమ్నద్వారా నడిపించిన మోహము ఉండదు, ద్వేషము ఉండదు.   ఏడు చక్రములలోను ఓంకారోచ్ఛారణ , బీజమంత్రోచ్ఛారణలాంటి 12 క్రియలు  చేయుట వలన నవగ్రహములవలన కలుగు అనేక దోషములను సమూలముగా నివారించుకొనవచ్చును. ఈ క్రియలు అతి సులభముగా నేర్చుకొనవచ్చును.

ఆరోగ్యకరమయిన వ్యక్తీ రోజుకి 21,600 శ్వాస నిశ్వాసలు చేస్తాడు.  అనగా ఒక నిమిషము నకు 15 శ్వాస నిశ్వాసలు చేస్తాడు. మనిషి పుట్టినపుడు తనతోపాటు ఇన్ని హంసలు అనగా శ్వాస నిశ్వాసలను తెచ్చుకుంటాడు. ప్రాణాయామ పద్ధతులద్వారా  ఈ శ్వాస నిశ్వాసలను సాధకుడు నియంత్రణ చేసికొని అతి తక్కువ శ్వాస నిశ్వాసలను చేసి తనజీవితాన్ని పొడిగించుకోగలడు.  ఈ విధముగా మార్కండేయ తన జీవితాన్ని పొడిగించుకొని చిరంజీవి అయినాడు. క్రియాయోగ ప్రాణాయామ పద్ధతులద్వారా తన జీవితాన్ని తను నియంత్రించుకోగలడు.  పరమహంస శ్రీ శ్రీ యోగానందలాంటి వారు తనకి జ్యోతిష్యము ప్రకారము జరగవలసిన రెండు వివాహములను క్రియాయోగ ప్రాణాయామ పద్ధతులద్వారా జరగకుండా చేసికోగలిగారు.  కనుక అటువంటి మహానుబావులను స్ఫూర్తిగా తీసికొని మనము కూడా క్రియాయోగ ప్రాణాయామ పద్ధతులద్వారా  పరమాత్మను పొందగలము. 



VAASTU - Direction of Life



Vaastu:

               * Blend of science, astronomy and astrology and one         
                  of the eminent features of Indian heritage. 

               * The actual scope of vastu shastra is very wide, as it 
                  covers concepts of Astrology,Science, Mathematics, and
                  lot of other disciplines.

               * Vastu-dwellings of humans or gods--Sanskrit.

Vastu  Purush

Vastu  Purusha


              *  It is basically derived from the likeness of the human  
                 32 gods figure, head in the North-East in the mandal of 64 squares,
                 the legs in the South-West, right hand in North-West, left
                hand in South-East and other parts the body fill the square.  
              
               * 32 gods or deities are constituent of the body
                 of Vastu purush.

              * When these are scrupulously followed proper ventilation                               
               and good disposition to Sun and privacy is ensured. 












Aakruti:
                                                       
               *Many factors govern the life of human beings like fate
                  and his surroundings. It is believed that Vastu make
                  sweet things sweeter and bitter things bitter.

               * Belief-If the construction is not according to Vastu
                  principles ,thinking and action of people residing in
                  buildings lead to disorderlines.

               * Vastu is not only for dwellings, but also for industrial
                   and commercial buildings, ancient temples ,cities etc.
               * So Architects and Vastu engineers coordinate.

               * Basic idea is to harmonise with the neighborhood,
                  nature and the universe.

               * Many rules are common sense as they relate to
                  ventilation and sunlight.

               * Internal planning of buildings is equally important.
               * Most of the south Indian temples are according to
                  Vastu. 




Basic principles


               * The North east is assigned to Water---borewell , under- ground water tank.                                                                            
               * South east is for Fire�Kitchen, pantry, furnace, boilers.
               * Northwest is assigned for Air�Store, guest room
                  finished goods.
               * South west for Earth---stable elements.
               * Centre is assigned for Space�least possible activity in 
                  this area.
               * Belief-with Vastu destiny is not changed, but it is
                  smoothened.        


* Vastu Shilpa Shastra, is an ancient Indian
                science for designing and building structures.



                                                                                         


  



               P r i n c i p l e s   o f   V a s t u.................................. 


 Placement of universal elements

               * Basic principles of Vastu enables us to achieve balance
                  among the basic elements of the universe such as fire
                  air, space, earth and water.

               * Belief-When harmony between these elements gets              
                  disturbed, it leads to stress, illness and tension of the
                  residents.

              * For best results any activity in the house or office should 
         be supplemented by the cosmic position of elements.
                              


   
  

              V a s t u   P u r u s h a   M an d a l a.........................


              * Vastu - surrounding, Purusha - energy, workplace, 
               Mandala - the astrological chart which relates the
                 layout to orientation.

               * The principles of orientation is directly related to the
               Vastu purusha mandala.

              *  The plan of the layout of a temple or a residential
               building is technically called Vastu Purusha Mandala .
               *  A grid of 8 x 8 = 64 spaces or 9 x 9 = 81 spaces of 
                 equal dimensions.

              * Addressed as an energy grid, in a modern architectural
                 context.

              * These layouts are squares two dimensionally, and
                 cubes tri-dimensionally. 



  

               Basic Principles 


                 The Vastu Purush Mandal is a square, which is its
                 essential form, and it takes its symbolism and significance
                 from the square mandal of the earth. 
  

                  The design regime for the Vastu architect follows specific
                 parameters:
                      * Orientation and siting considerations
                      * Building Layout with regard to a grid called "Vastu 
                           Purusha Mandala"
                      * Dimensioning

                      * Exterior door locations

                      * Room Placement

                      * Height

                      * Layout and interior planning. 

                     *The general slope the site is very important.

               *Sloping down to the East, Northeast or North is

                  considered to be beneficial with the opposite having

                  negative effects for the occupants of the structure.

              *Water position also plays an important role in Vastu

                  architecture. Northeast being the best location for a body

                  of water.

              *Vastu define specific positions for each activities and

                  room placement in the site.  







Significance of Energy Belts in Layout of Living Space
=========================================




CREDITS :
By Dr. Jessie Mercay
posted by Ganesh
Cosmic Space turns itself into form according to its own desire. As mentioned earlier, the Source material called Cosmic Fire or Brahma Sutra is the thread of light or consciousness also known as “Luminous Nataraja.” The primal form is known as microabode in English. It is square at its base and cubical in structure with six sides. It is called Chidambaram in Sanskrit. This square pattern is the subtle unit of Space (anu) and is the shape of the subtle space contained in our heart known as Atman or Soul (some people refer to individual Atman as jivatman (embodied Soul) – but there is no difference so we use the term Atman). There is a creative hotness in this Cosmic fire called vaisvanara Agni or Cosmic Fire – the flame is blue.
On the journey to manifestation, this subtle cube or microabode replicates itself through frequency or waveform by virtue of Absolute Time or Shakti. Thus, Absolute Time or Shakti is frequency, pulse, vibration or waveform. When this unitary cell goes into action, it splits itself into 64 or 81 smaller cubes or ‘padas’; this is called Vaastu Purusha Mandala. These fractional spaces unfold in sequential order as concentric square belts around the central point called Brahma Pada (luminous space-of fire), Devika Pada (space of effulgence), Maanusha Pada (space of awareness) and Paisaachika Pada (space of grossness). These concentric belts are wave patterns and form one large wave pattern.
These 64 (in the 8×8) or 81 (in the 9×9) Padas that make up the energy belts have specific qualities and characteristics that, when stimulated by human activity, emit specific frequencies and then affect the human occupant based on those frequencies or qualities. Their role as emanations of consciousness cannot be overstated in terms of their effect on humans. Their qualities along with the five Elements guide the placement of rooms, doors, and activities in a Vaastu house. They are referred to as luminaries because they are direct luminescent energies born of consciousness or Brahmam. The Vaastu Purusha Mandala acts as a filter or grid through which the energy of Brahmam (light energy) passes and is fractionalized. That fractionalization splits the light consciousness and forms individuated energy forms – Padadevatas (Riks). Each of these forms has specific values and qualities that reflect in the building. And, each of these forms contain aspects of Cosmic knowledge.
The individuated qualities of these cosmic forms is reflected within a diagram called Phalagunasruti – qualities of consciousness in seed form. In addition to OM light, OM Sound, the five elements and three gunas, these Padadevatas influence the occupant and thus the life of the occupant in innumerable ways. In the chart below you will see notations for the placement of front doors according to Vaastu Shastras. There are positive qualities derived from the placement of doors at certain padas that contain specific Padadevatas. You will note that doors placed incorrectly produce negative results. Does this mean that the Padadevata in that space is negative? No, not necessarily. It simply means that energy does not react well to the stimulation resulting from a door being in its place.
Front door placement is indicated by broad arrows in the cardinal directions. The preferred door placement on all sides is the fourth pada from the corner going clockwise around the mandala from the Northeast. Contrary to popular belief the Vaastu Shastras make it clear that a front entrance may be in any one of four cardinal directions. Lack of knowledge of the Shastras has caused individuals and groups to propagate improper information on the topic of front door placement. Because they are unaware of the concept of “proper pada placement” they fear placing the door anywhere but the East. It is a fact that the door must be in the proper pada in each direction. Improper placement in any direction can bring mishaps to the occupant.
The Padadevatas shown here are found throughout the Vedas and referred to as Riks. (The author is the first person to make this connection between the Padadevatas and the Riks in the Veda in modern times). It is said in the Rig (Rik) Veda that He who is awake the Riks will seek him out. The general concept here (stated in a simplistic way) is that in a Vaastu house, at some point when the occupant becomes attuned to the divine frequency of the house, Divine knowledge (divine experience – spiritual bliss) will come to him or her. 

Vastu recommendation for Plots

Plot should be square of rectangular in shape. Square would be best. If it is rectangle then the ratio of length to breadth should be 1:2 and not more than that.

The ground level should be higher in South & West rather than North and East.
Plots facing North or East are better than those facing South or West.

A canal, a lake, river, nallah, a big well or pond should be in north or east only.
Heavy construction or mountains should be in west or south of the plot.
There should not be any big tree in north or east of the plot.

There should not be any pit or well in south or west direction.
All four corners should be at 90 degree (set Square). If only north east is extended i.e. if it is less than 90 degree, it will do.

All rain water should flow from south to north and west to east.
South west should be highest & north east should be lowest in level.
If all the corners are not at 90 degree then we should correct it before starting the construction.
If the dead end of a road is coming in our plot then it should be taken care of because some are good & some are bad. This is called vidhee soola.

Their should not be any hills or mountains in east or north side of your plot.
At the time of purchasing the adjacent plot purchase only in east, north or north-east plots. Never purchase adjacent plot in south or west or accept if even if offered for free
Vastu for House – Vastu Shastra for Home

If main gate of house is toward south-facing, one should get a door constructed in north in front of south door as well.

Food grain should be stored in either north or north-west direction. It should never be stored in south-west direction.

A door just above the front door or straight in front of it causes increment in expenses and poverty, so beware of it.

Staircase is considered to be auspicious toward the right side of south and west direction. Staircase should not be built in north-east direction.

North-east directions should either be used as waiting room or as a guest-room. Otherwise it should be left unused.

Trees should be planted at such length from the house that their shadows should not touch it from 9 am to 3 pm.

Store room should be either built in south-west direction or out of house. Its door should not face south-east, north-east and south. As per Vastu, store’s door should be black colored and water should not be kept in it.

Within the home, it is better to have doors and windows facing toward each other. More windows in north direction increase prosperity in family. It makes goddess Lakshmi and Kuber happy.
Basement is believed to be auspicious, if it is toward north or east direction of the house. However, if it is in either south or west direction, it causes a lot of trouble.





Vastu for Office -Vastushastra for Offices

While constructing an office, it should be kept in mind that administrative area should be toward east, chairman’s room toward north-east, account department toward west, temple toward south-east direction and lobby in the center.

Money and documents should be kept in a safe toward north. If it is not possible, make sure the doors of safe open toward north direction. It is recommended to keep the safe 2-3 inches away from the wall.

Elevator should be installed in north, north-east or east direction. As per Vastu, south and south-west directions are not appropriate for elevator and, therefore, should be avoided.

In a factory boiler should be placed in south-east direction and generator in south-west.

Machines should be placed toward west and workers should face toward east.

Burner should be installed in south-east direction of the kitchen. Similarly, electric-geyser and other electric equipments should be placed toward south-east direction in bathroom.

The main gate of factory should be constructed in such a way so that it faces either north-east or west direction.

The main gate of a hotel, restaurant is considered auspicious if it faces the north-east direction. In a hotel, food should be cooked toward west and western side of it should be slightly higher than the    eastern, similarly southern side should be slightly higher than the northern.










వాస్తు


వా స్తు


వాస్తు ఇంటి నిర్మాణంలో తీసికొనవలసిన నియమాలు నిబంధనలకి సంబంధించిన శాస్త్రము.   ఇంటి నిర్మాణంలో మూడు ముఖ్యవిషయములు గుర్తుంచుకొనవలయును.  గాలి, వెలుతురు మరియు నీరు బాగా వచ్చేటట్లు ఇంటి నిర్మాణం చేయవలయును. 

వంట ఇల్లు ఆగ్నేయం (SE) లోనూ, పెంట అనగా పాకీదొడ్డి నైఋతి దిక్కు (SW)లోనూ, పంట అనగా కూరగాయల మరియు పూలతోట   వాయువ్యం (NW) లోనూ, మంచినీటిగుంట అనగా బావి మరియు నీళ్ళ పంపు ఈశాన్యం (NE) లోనూ ఉండేటట్లు చూసుకోవాలి. 

కిటికీలు మరియు తలుపులు సరి సంఖ్యలోనూ ఉండేటట్లు చూసుకోవాలి.అట్లా అని సరి సంఖ్యలో ఉండాలికదా అని చివర సున్నా ఉండకూడదు.  అనగా కిటికీలు మరియు తలుపుల సంఖ్య 10, 20 మరియు  30  వగైరా  అట్లా ఉండకూడదు.

ఎటువంటి జాతకులకైనా  ఇంటి లోనికి పడమరనుండికాని, దక్షిణం నుండికాని ప్రవేశము అన్నివిధాలా మంచిది. 
అదేవిధముగా తల దక్షిణమున గాని, పడమర వైపు గాని పెట్టుకొని నిద్రించవలయును.  అనగా మనము తూర్పుగాని ఉత్తరముగాని చూస్తూ నిద్రించుట ఉత్తమము.  ఉత్తరదిక్కున తలపెట్టుకొని నిద్రించకూడదు. ఎందుకంటే మనతల ఉత్తరము, పాదములు దక్షిణము. భూమి ఒక అయస్కాంతం లాంటిది. భూమియొక్క ఉత్తరదిక్కున తలపెట్టుకొని పడుకున్న యడల, మనతల ఉత్తరము మరియు భూమియొక్క ఉత్తరము వికర్షణ చెంది తలకాయ నొప్పులు, కలలు, రక్తపోటు రావడం వగైరా వగైరా వస్తాయి.
    
నైఋతి(SW) వైపు బరువు అనగా సామానులు అవీ పెట్టుకునేందుకు కావలసిన అల్మైరాలు అవీ కట్టుకొనవలయును. 

పడమర దిక్కున కట్టుకునే గోడ తూర్పు దిక్కుకంటే ఎత్తగా ఉండవలయును.

మనము కూర్చొని ధ్యానము చేసే పూజగది తప్పక ఉండవలయును. దేవుని విగ్రహములు పడమరను చూస్తూ వాటి ఎదుట మనము తూర్పును చూస్తూ ఉండేటట్లుగా కూర్చొని ధ్యానము చేసేటట్లుగా ఉండవలయును.
ఎన్నిగదులున్న గదికి ఒక్కడు చొప్పున అంతమంది ఆ ఇంట్లో రోజూ భోజనము చేయవలయును. లేనియడల గ్రహశాంతి మరియు గృహశాంతి రెండూ కరువగును. కనుక ఎక్కువ గదులున్నయడల అద్దెకిచ్చుకోనుట ఉత్తమము.




 

వాస్తు శాస్త్రము

1 మనము కొత్తగా ఇల్లు కట్టుకున్నప్పుడు వాస్తు విషయాలను తప్పక పా టింపవలయును. గాలి, వెలుతురు, నీరు మొదలగునవి మన ఇంటిలో నికి ఆహ్వానించే విధంగా మనము ఇంటి నిర్మాణము చేయవలెను.


2 మనము స్థలము కొనుగోలు చేయునపుడు నలు చదరముగా గాని, సమకోణ దీర్ఘ చతుర స్రాకారముగ ఉన్న స్థలంగాని ఎంపిక చేసుకోవాలి. అది తూర్పు, ఉత్తరం పల్లంగా వుండాలి. ఈశాన్యం పల్లంగా ఉన్న స్థలం చాల మంచిది. 3 ఇంటికి చుట్టు ప్రహరి ఉండుట చాల మంచిది.


4 ఇల్లు కట్టుకొనే ముందు ఇంటికి చూట్టూ ఖాళీ స్థలం వుంచుకోవాలి. తూర్పు, ఉత్తరాలతో ఎక్కువ ఖాళీ స్థలం ఉంచుకొనుట చాలా మంచిది .


5 ఈశాన్యం పెరిగిన స్థలం చాలా మంచిది. ఈశాన్యం ఎంత పెరిగితే అంత మంచిది . ఈశాన్యం కాకుండా ఏ మూల పెరిగినా దానిని తగించే వీలు వుంటెనే ఆ స్థలాన్ని తీసుకోవాలి.


6 స్థలము, గృహాలతో నిగదులు తూర్పు భాగమునకు పల్లముగా ఉండాలి. మనము వాడిన నీరు తూర్పునకు గాని, ఈశాన్యానికి గానీ వెళ్ళే విధంగా కట్టుకోవాలి.


7 ఇంటికి ద్వారాలు తూర్పులోనూ, ఉత్తరములోనూ, ఉత్తరములోనూ, ఈశాన్యాలలోనూ, దక్షిణ ఆగ్నేయం, పశ్చిమ వాయువ్యంలో ఉంటె మంచిది. ఉత్తర వాయువ్యాలలో, తూర్పు ఆగ్నేయంలో, దక్షిణ నైరుతి లో మరియు పశ్చిమ నైరుతి లో ద్వారాలు ఉండకూడదు.


8 . వంటగది నిర్మాణము ఈశాన్య భాగమున ఉండరాదు. ఈశాన్యం మూల పొయ్యి అసలు ఉండరాదు. ఇంటిలో పొయ్యి ప్రధానంగా ఆగ్నేయంలో ఉండాలి. అలా వీలు కుదరనప్పుడు నైరుతి భాగములో పెట్టవచ్చును. మిగతా దిశలు పొయ్యికి పనికి రావు.


9 . ఇంటిలో ఈశాన్య భాగములో పూజా మందిరం నిర్మించుట చాలా మంచిది.


10 .పడక గది నైరుతి భాగములో కట్టుకోవాలి. దక్షిణం వైపు తల ఉంచి నిదురించుట చాలా మంచిది. ఎట్టి పరిస్థితులలోను ఉత్తరం వైపు తల ఉంచి నిదురించ కూడదు.


11 . గొయ్యి లేకుండ ఉండేటటువంటి మరుగు దొడ్డి ఆగ్నేయంలో నిర్మించు కొనుట చాలా మంచిది. సెప్టిక్ టాంకులు తూర్పు, ఉత్తరాలలో కట్టుకొనవచ్చును. లెట్రిన్ లో తూర్పు ముఖంగాను, పడమర ముఖంగాను కూర్చోన కూడదు. ఈశాన్యములో మరుగు దొడ్డి అసలు ఉండకూడదు.





జ్యోతిశ్శాస్త్రము - ముక్తి



మన జీవితములు ఇచ్చాశక్తి మీద మరియు కర్మమీద ఆధారపడి ఉంటాయి. ఇచ్చాశక్తిని  ఉపయోగించి మనము  వస్తువును ఎన్నుకుంటాము. వస్తువును ఎన్నుకున్నతదుపరి మనము క్రియ చేస్తాం.  మనజీవితములోని ఒడుదుడుకు లన్నిటికీ కేవలము మనము చేసే పనులే  పూర్తిగా కారణము కాదు.      
.
మనము క్రితం జన్మలలో చేసిన  కర్మలఫలితముగా ఎన్నోఅనూహ్య  సంఘట నలు మనజీవితములో చోటు చేసికుంటూఉంటాయి.  కనుక మనజీవితములు కేవలము  ఇచ్చాశక్తి కాక కర్మ మీద కూడా ఆధారపడిఉంటాయి.
జ్యోతిశ్శాస్త్రము ప్రకారము, తొమ్మిది గ్రహములు తమతమ స్థానమునుబట్టి స్థితిని కలుగజేస్తాయి.  ఆయాస్థితిగతులనను సరించి జాతకునకు బట్టిన ఆయాకర్మలను, మరియు ఆయాకర్మల ప్రభావమును ఏ ఏ సమయములలో ఆ జాతకుడు అనుభవించ వలసి వచ్చునో  చెప్పవచ్చు.  ఉదాహరణకి శనియొక్క స్థానమునుబట్టి, మనము  కూడగట్టిన చెడ్డ కర్మలను, ఆ  కూడగట్టిన చెడ్డ కర్మలు మన జీవితములను ఏ విధముగా చెడుగా  శాసించునో ఊహించవచ్చు.  నవగ్రహములు మన జీవితములను శాసిస్తాయి  లేదా ప్రభావితము చేస్తాయనటము  సరిగాదు.  నిజానికి మనకర్మలె  మన జీవితములను శాసిస్తాయి  లేదా ప్రభావితము చేస్తాయి.  కాని నవగ్రహముల స్థానములు  మన జీవితములను శాసిస్తాయి  లేదా ప్రభావితము చేస్తాయి.

జ్యోతిశ్శాస్త్రము ఎంత గొప్పది అయిననూ దానిని  సరిగ్గా అర్థము చేసుకొని ఆ నవగ్రహముల స్థానములను నిర్ణయం చేయుటకు నిష్ణాతుడైన జ్యోతిశ్శాస్త్ర పండితుడు అవసరము


  • 8 ½ గంటలు  =   1000 క్రియలు  =  1000 సంవత్సరముల అభివృద్ధి


  • 8 ½ గంటలు x 165 దినములు  =    3,65,000 సంవత్సరముల అభివృద్ధి. 


కనుక 10 లక్షల సంవత్సరముల అభివృద్ధిని   3 సంవత్సరములలో  సాధించి ముక్తి పొందవచ్చు.
భౌతిక శరీరములోకాని, సూక్ష్మశరీరములోకాని, ఒకమనిషికి కేటాయించిన జీవితకాలము అతని కర్మానుసారము పూర్వనిర్దారితమై ఉంటుంది.  పురోభివృద్ధి చెందిన క్రియాయోగి జీవితం పూర్వకర్మ ఫలితాల వల్ల కాక, కేవలం  ఆత్మనిర్దేశాలవలనే ప్రభావిత మౌతుంది. ఈ ప్రపంచం యావత్తు ధ్రువత్వ నిరంకుశాదికారానికి లోబడి యున్నది.  ఏ శాస్త్రమయినా స్వతః సిద్ధమయిన వ్యతిరేకసూత్రాలు లేదా విరుద్ధసూత్రాలు లేకుండా లేదు.

దేవుడు కుమారుడంటే మనిషిలోఉన్న కూటస్థలేక దివ్యచైతన్యం.
గంగాధరుడు అనగా వెన్నులో ఉన్న ప్రాణప్రవాహాము అనే నదిని అధీనములో ఉంచుకొన్నవాడు.
పూర్వజన్మలో యోహానే ఎలిజా. ఆ జన్మలో ఏసుక్రీస్తే ఎలీషా. ఎలీషా గురువు  ఎలిజా.
ఈ జన్మలో ఎలీషాయే ఏసుక్రీస్తు. ఈ జన్మలో ఎలిజాయే జాన్.  ఈ జన్మలో జాన్ ఏసుక్రీస్తు కి శిష్యుడు.
నాలుగు కులాల్లో ఏదో కులములో చేరడానికి పుట్టుకతో నిమిత్తం లేదు.  జీవితములో మనము సాధించడానికి ఎంచుకున్న లక్ష్యము వలన అయే సహజ శక్తుల మీద ఆధారపడిఉంటుంది.



కేతు గ్రహ


కేతుగ్రహ జపం (Kethu graha Japam) 



ఆవాహనము:

అస్యశ్రీ శుక్ర గ్రహ మహా మంత్రస్య యజచ్చంద ఋషిః!

కేతుగ్రహో దేవతా! గాయత్రీచ్చందః (మమ) యజమానస్య

అధిదేవతా ప్రత్యధిదేవతా సహిత కేతుగ్రహ సిద్ద్యర్దే

కేతుగ్రహ మంత్రజపం కరిష్యే!!

కరన్యాసము:

ఓం కేతుం కృన్యత్ - అంగుష్టాభ్యాసం నమః

ఓం కేతవే - తర్జనీభ్యాం నమః

ఓం పేశోమర్యా - మధ్యమాభ్యాం నమః

ఓం అపేశసే - అనామికాభ్యాం నమః

ఓం సముషద్భి: - కనిష్టికాభ్యాసం నమః

ఓం అజాయుతాః - కరతల కరపృష్టాభ్యాసం నమః

అంగన్యాసము:

ఓం కేతుం కృన్యత్ - హృదయాయ నమః

ఓం కేతవే - శివసేస్వాహా

ఓం పేశోమర్యా - శిఖాయైవషట్

ఓం అపేశసే - కవచాయహు

ఓం సముషద్భి: - నేత్రత్రయాయ వౌషట్

ఓం అజాయుతాః - అస్త్రాయఫట్

ఓం భూర్భువస్సువరోమితి దిగ్భంధ:

ఆదిదేవతాః

బ్రహ్మ దేవానాం పదవీ: మృషిర్వి

ప్రాణాం మహిషో మృగాణాం!

శ్యోసో గృద్రాణాగ్ స్మధి తిర్వనా నాగ్

సోమః పవిత్ర మత్యేతి రేభన్!!

ప్రత్యథి దేవతా:

సచిత్ర చిత్రం చితయస్త మస్మే చిత్ర క్షత్రం

చిత్రతమావయోధాం చంద్రం రాయింపురు

వీరం బృహస్తం చంద్ర చంద్రాభిర్గ్రణతే దువస్వ!!

వేదమంత్రం

ఓం కేతుం కృన్వన్న కేతవే పేశోమార్యా అపేశసే!

సముషద్భిరజా యధాః కేతు కవచ స్తోత్రం

చిత్రవర్ణ శ్శిరః పాతు! ఫాలంమే ధూమ్ర వర్ణకః!

పాతు నేత్రే పింగళాక్షః! శ్రుతీమే రక్షలోచనః

ఘ్రుణం పాతు సువర్ణాభో! ద్విభుజం సింహికాసుతః!

పాతు కంఠంచ మే కేతు:! స్కంధౌ పాతు గ్రహాధిపః!

బాహుపాత సురశ్రేష్ట:! కుక్షిం మహోరగః పాతు!

సింహసనః కటిం పాతు! మద్యం పాతు మహాసురః!

ఊరు: పాతు మహాశిర్దో! జానునీ ఛ ప్రకోపనః!

పాతు పాదౌచమే రౌద్రః! సర్వాంగం రవిమర్ధకః

ఫలశ్రుతి:

య ఇదం కవచం దివ్యం సర్వరోగ వినాశనః!

సర్వదుఃఖ వినాశనం (చ) సత్యమేత న్నసంశయ:

కేతుగ్రహ మంగళాష్టకం

కేతు ర్జైమిని గోత్రజః కుశసమిద్వాయవ్య కోణేస్థిత:!

చిత్రాంక ధ్వజలాంచనోహి భగావాన్యో దక్షిణౌశాముఖః!

బ్రహ్మచైవచు చిత్రగుప్త అధిప: ప్రత్యాధి దేవస్సదా!

షట్ట్రింశ స్శుభకృచ్చ బర్భర పతి: కుర్యాత్సదా మంగళం!


కేత్వష్టోత్తర శతనామావళి:


ఓం కేతవే నమః ఓం స్థూలశిరసే నమః ఓం శిరసోమాత్రే నమః

ఓం ధ్వజాకృతయే నమః ఓం నవమగ్రహాయ నమః

ఓం సింహికాసురీ సంభూతాయ నమః ఓం మహాభీతికరాయ నమః

ఓం చిత్రవర్ణాయ నమః ఓం పింగళాక్షాయ నమః

ఓం ఫాలధూమ్ర సంకాశాయ నమః ఓం మహోరగాయ నమః

ఓం రక్తలోచనాయ నమః ఓం చిత్రకారిణే నమః ఓం మహాసురాయ నమః

ఓం తీవ్రకోపాయ నమః ఓం క్రోధనిధయే నమః ఓం పాపకంటకాయ నమః

ఓం తీక్ష దంష్ట్రాయ నమః ఓం ఛాయాగ్రహాయ నమః ఓం అంత్యగ్రహాయ నమః

ఓం మహాశీర్షాయ నమః ఓం సూర్యారయే నమః ఓం పుష్పవద్ద్వైరిణే నమః

ఓం వరదహస్తాయ నమః ఓం గదాపాణయే నమః ఓం చిత్రశుభ్రధరాయ నమః

ఓం చిత్రరాథాయ నమః ఓం కుళుత్దభక్షకాయ నమః ఓం వైడూర్యాభరణాయ నమః

ఓం సఉత్పాతజనకాయ నమః ఓం శుక్ర మిత్త్రాయ నమః ఓం మందసఖాయ నమః

ఓం జైమినీగోత్రజాయ నమః ఓం చిత్రగుప్తానే నమః ఓం దక్షిణాభిముఖాయ నమః

ఓం ఘనవర్ణాయ నమః ఓం ఘోరాయ నమః ఓం ముకుందవర ప్రదాయ నమః

ఓం మహాసురకులోద్భవాయ నమః ఓం లంబదేవాయ నమః ఓం శిఖినే నమః

ఓం ఉత్పాతరూపధరాయ నమః ఓం మృత్యుపుత్త్రాయ నమః

ఓం కాలాగ్ని సనిభాయ నమః ఓం నరపీఠకాయ నమః ఓం సర్వోపద్రవకారకాయ నమః

ఓం వ్యాదినాశకరాయ నమః ఓం అనలాయ నమః ఓం గ్రహణకారిణే నమః

ఓం చిత్రప్రసూతాయ నమః ఓం అదృశ్యాయ నమః ఓం అపసవ్యప్రచారిణే నమః

ఓం నవమేపాపదాయ నమః ఓం ఉపరాగగోచరాయ నమః

ఓం పంచామేశోకదాయ నమః ఓం పురుషకర్మణే నమః

ఓం తురీయస్తేసుఖ ప్రదాయ నమః ఓం తృతీయేవై రదాయ నమః ఓం పాపగ్రహాయ నమః

ఓం స్పోటకారకాయ నమః ఓం ప్రాణనాథాయ నమః ఓం పంచమేశ్రమకరాయ నమః

ఓం ద్వితీయేస్ఫుటవత్ప్రదాయ నమః ఓం విశాకులితవక్త్రాయ నమః

ఓం కామరూపిణే నమః ఓం చతుర్దేమాతృనాశకాయ నమః

ఓం నవమేపితృనాశకాయ నమః ఓం అంతేవైర ప్రదాయ నమః ఓం సింహదంతాయ నమః ఓం సత్యే అసృతపతే నమః ఓం సుతానందబంధకాయ నమః ఓం సర్పాక్షిజాతాయ నమః

ఓం కర్మరాశ్యుద్భవాయ నమః ఓం ఉపాంతేకీర్తిదాయ నమ

ఓం సప్తమేకలహప్రదాయ నమః ఓం పంచమేశ్రమకరాయ నమః

ఓం ఊర్ద్వమూర్ధజాయ నమః ఓం అనంగాయ నమః ఓం అష్టమే వ్యాధికర్త్రే నమః

ఓం ధనేబాహుసుఖ ప్రదాయ నమః ఓం జననేరోగదాయ నమః ఓం గ్రుహోత్తంసాయ నమః

ఓం అశేషజనపూజితాయాయ నమః ఓం పాపద్రుష్టయే నమః ఓం ఖేచరాయ నమః

ఓం శాంభనాయ నమః ఓం నటాయ నమః ఓం నశాశ్వాతాయ నమః ఓం ప్రాణనాథాయ నమః

ఓం శుభాశుభఫల ప్రదాయ నమః ఓం సుథాపయినే నమః ఓం ధూమ్రాయ నమః

ఓం సింహాసనాయ నమః ఓం రవీందుద్యుతిశమనయ నమః ఓం అజితాయ నమః

ఓం విచిత్రకపోలస్యందనాయ నమః ఓం భక్తవత్సలాయ నమః ఓం భక్తరక్షకాయ నమః

ఓం భక్తాభీష్టకాయ నమః ఓం కేతుమూర్తయే నమః

కేతు స్తోత్రమ్

ఓం అస్యశ్రీ కేతు స్తోత్ర మహామంత్రస్య వామదేవఋషి: అనుష్టమ్ చంద!

కేతుర్దేవతా కేతుగ్రహప్రసాద సిద్ద్యర్దే జపే వినియోగః

గౌతమ ఉవాచ

మునీంద్ర సూత తత్వజ్ఞ సర్వశాస్త్ర విశారద

కేతుగ్రహోపతప్తానాం బ్రహ్మణా కీర్తితం పురా.

ఏకః కరాళవదనో ద్వితీయో రక్తలోచనః

తృతీయ: పింగళాక్షశ్చ చతుర్థోపి విదాహకః

పంచమః కపిలాక్షశ్చ షష్ట: కాలాగ్ని సన్నిభ:

సప్తమో హిమగర్భశ్చ దూమ్రవర్ణోష్టమస్తథా.

నవమః పాపకంఠశ్చ దశామో నరపీడకః

ఏకాదశస్తు శ్రీకంఠో వనమాలావిభూషణ:

ద్వాదేశైతే మహాక్రూరాః సర్వోపద్రవకారకాః

పీడ్యేతే సర్వకాలేషు దివాకరనిశాకరౌ

కలశే నీలవర్ణాభే ప్రభాక్రవిశాకరౌ నిక్షిష్య యే తు

షట్కోణే పద్మే చాష్టదళే క్రమాత్ కేతుం కరాళవదనం

సర్వలోకభయంకరం ప్రతిమాం వస్త్రసంయుక్తాం

చిత్రాం చైవ ప్రదాపయేత్ దానేనానేన సుప్రీతో భావేయు:

సుఖదాయినః వత్సరం ప్రయతాభూత్యా పూజయంతి సర్వోత్తమా:

మూలమష్టోత్తర శతం యే జపంతి సర్వోత్తమా:

తేషాం కేతుప్రసాదేన న కదాచిద్భయం భవేత్ ఇతీ శ్రీ బ్రహ్మాండ పురాణేవ

వాసుదేవసంవాదే కేతు స్తోత్రం సంపూర్ణమ్.


కేతు మహర్దశలో చేయవలసిన దానములు:


1. కేతు మహర్దశలో కేతు అంతర్దశలో ఉమామహేశ్వర దానం చేయండి.

2. కేతు మహర్దశలో శుక్ర అంతర్దశలో దుర్గా దానం చేయండి.

3. కేతు మహర్దశలో రవి అంతర్దశలో భాగ దానం చేయండి.

4. కేతు మహర్దశలో చంద్ర అంతర్దశలో వెండి గుర్రం దానం చేయండి.

5. కేతు మహర్దశలో కుజ అంతర్దశలో నూనె ఘటం దానం చేయండి.

6. కేతు మహర్దశలో రాహు అంతర్దశలో గుమ్మడిపండు దానం చేయండి.

7. కేతు మహర్దశలో గురు అంతర్దశలో తిల దానం చేయండి.

8. కేతు మహర్దశలో శని అంతర్దశలో గేదె దానం చేయండి.

9. కేతు మహర్దశలో బుధ అంతర్దశలో లేడి దానం చేయండి. గమనిక: కొన్ని వస్తువులు దొరకనప్పుడు వాటికి
    మారుగా ధనమిచ్చుట కంటెను ఆ వస్తువు ఆకారంలో వెండితో ప్రతిమ చేయించి దక్షిణతో ధారపోయవచ్చును.

అంగారక గ్రహ

ఋణవిమోచక అంగారక స్తోత్రమ్ (Runa Vimochaka Angaraka Stotram)



స్కంద ఉవాచ :

ఋణగ్రస్తరాణాం తు – ఋణముక్తి: కథం భవేత్!

బ్రాహ్మోవాచః వక్ష్యే హం సర్వలోకానాం – హితార్థం హితకామదమ్

శ్రీమందగారస్తోత్రమహామంత్రస్య – గౌతమ ఋషిః అనుష్టమ్ ఛందః

అంగారకో దేవతా మమ ఋణవిమోచనార్ధే జపే వినియోగః

ధ్యానమ్

రక్తమాల్యాంబరధర : - శూలశక్తి గదాధరః

చతుర్భుజో మేషగతో వరదశ్చ ధరాసుతః

మంగళో భూమిపుత్రశ్చ – ఋణహర్తా ధనప్రదః

స్థిరాసనో మహాకాయః – సర్వకామఫలప్రదః

లోహితో లోహితాక్షశ్చ – సామగానం కృపకరః!

ధారాత్మజఃకుహోభౌమో – భూమిజో భూమినందనః

అంగారకో యమ శ్చైవ – సర్వరోగాపహారకః!

సృష్టే: కర్తా ఛ హర్తాచ – నిర్వదేవైశ్చ పూజితః

పితాని కుజ నామాని – నిత్యం యః ప్రయతః పఠేత్!

ఋణం చ జాయతే తస్య – ధనం ప్రాప్నో త్యసంశయమ్.

అంగారక! మహీపుత్ర! – భగవాన్ భక్తవత్సల నమోస్తుతే

మమాశేష – ఋణ మాశు వినాశయ రక్తగందైశ్చ పుష్పైశ్చ – దూమదీపైర్గుదోదకై:

మంగళం పూజయిత్యాతు – దీపం దత్వా తదంతికే ఋణరేఖాః

ప్రకర్తవ్యా – అంగారేణ తదగ్రతః! తాశ్చ ప్రమార్జయే త్సశ్చాత్ – వామపాదేన సంస్ప్రశన్.

మూలమంత్ర :

అంగారక మహీపుత్ర – భగవాన్ భక్తవత్సల!

నమోస్తుతే మమాశేష – ఋణ మాశు విమోచయ

ఏవం కృతే స సందేహో – ఋణం హీత్వాధనీ భవత్!

మహతీం శ్రియ మాప్నోతి – హ్యపరో ధనదో యథా ఆర్ఘ్యము:

అంగారక మహీపుత్ర! భగవాన్ భక్తవత్సల నమోస్తుతే

మమాశేష – ఋణ మాశు విమోచయ భూమిపుత్ర మహాతేజ – స్స్వేదోద్భవ పినాకినః

ఋణార్తస్త్వాం ప్రపన్నోస్మి – గృహాణార్ఘ్యం నమోస్తుతే ఇతి ఋణమోచాకాంగారక స్తోత్రమ్

బుధ గ్రహ

బుధ గ్రహ జపం (Budhagraha Japam)



ఆవాహనము:

అస్య శ్రీబుధగ్రహ మహా మంత్రస్య! కాశ్యప ఋషిః

బుధగ్రహోదేవతా త్రిష్టుప్ ఛందః బుధగ్రహ మాల మంత్ర జపం కరిష్యే!!

కరన్యాసము:

ఓం ఉద్భుద్యస్వాగ్నే ప్రతిజాగృహే - అంగుష్టాభ్యం నమః

ఓం త్వమిష్టపూర్తీ - తర్జనీభ్యాం నమః ఓం సగ్ నృజేధాంమయం చ -

మధ్యమాభ్యాం నమః ఓం అస్మిస్నదస్తే ఆవాః - అనామికాభ్యాం నమః

ఓం జయమానశ్చ సీదతి - కరతల కరపృష్టాభ్యాం నమః

అంగన్యాసము:

ఓం ఉద్భుద్యస్వాగ్నే ప్రతిజాగృహే - హృదయాయ నమః

ఓం త్వమిష్టపూర్తీ - శిరసే స్వాహా ఓం సగ్ నృజేధాంమయంచ - శిఖాయైవషట్ ఓం అస్మిస్నదస్తే ఆవాః - కవచాయహుం ఓం అద్భుతరాశ్మీన్ విశ్వదేవా - నేత్రత్రయా వౌషట్ ఓం జయమానశ్చ సీదతి - అస్త్రాయఫట్ ఓం భూర్వవస్సువరోమితి దిగ్భందః ఆదిదేవతా: ఇదం విష్ణుర్వి చక్రమే త్రేధానిదధే పదం! సమూఢ మస్యపాగ్ సురే!!

ప్రత్యథి దేవతా: సహస్ర శీర్షః పురుషః! సహస్తాక్ష సహస్ర పాత్! నభూమిం విశ్వతో వృత్యా! అత్యతిష్ట దశాంగులమ్!! వేద మంత్రము: అద్భుద్య స్వాగ్నే ప్రతి జాగృహ్యే! సామిష్టా పూర్తేనగ్ సృజేధామయంచ పునః కృణ్వగ్ స్త్వాపితరం యువాన మన్వాతాగ్! సీత్వయితంతు మేతం!! బుధ కవచ స్తోత్రము పీతాంబర ధరః పాతు! పీతమాల్యానులేపనః! బుధః పాతు శిరోదేశం సౌమ్యః పాతు ఛ ఫాలకం!!

నేత్రే జ్ఞానమయః పాతు! శ్రుతీ పాతు!విభూద్భవః! ఘ్రాణం గంధ ధరః పాతు! భుజౌపుస్తక భూషితః! మధ్యం పాతు సురారాద్యః! పాతునాభిం ఖగేశ్వరః! కటిం కాలాత్మజః పాతు! ఊరు: పాతు సురేశ్వరః! జానునీ రోహిణి నూను:! పాతు జంఘే ఫలప్రదః! పాదౌ బాణాసనః పాతు:! సౌమ్యౌఖిల వాపు:! ఫలశ్రుతి: ఏపోప్ కవచః పుణ్యం సర్వోపద్రవ శాంతిదః! సర్వరోగ ప్రశమనః సర్వదుఖ నివారకః! ఆయురారోగ్య శుభదః! పుత్రాపౌత్ర ప్రవర్తన:! యః పఠేత్కావచం దివ్యం శృణుయద్వా సమాహితః! సర్వాన్ కామా స్మవాప్నోతి! దీరఘమాయుశ్చ విందతి!!

బుధ మంగళాష్టకం సౌమ్యః పీత ఉదజ్ముఖ స్సమిదపామార్గోత్రి గోత్రోద్భవో: బాణేశాన దశస్సుహృద్ర విసితౌ వైరీం దురన్యే సమాః! కన్యాయుగ్మ పతిర్ధశాష్టక చతుష్టణ్ణేత్రగ శ్యోభానః! విష్ణుర్వ్టైభగదైవతో మగధవః కుర్యాత్సదా మంగళమ్!!

బుధాస్తోత్తర శతనామావళి: ఓం బుధాయ నమః ఓం బుధార్చితాయ నమః ఓం సౌమ్యాయ నమః ఓం సౌమ్యచిత్తాయ నమః ఓం శుభప్రదాయ నమః ఓం దృఢవ్రతాయ నమః ఓం దృఢఫలాయ నమః ఓం శ్రుతిజాల ప్రబోధకాయ నమః ఓం సత్యవాసాయ నమః ఓం శ్రేయసాంపతయే నమః

ఓం అవ్యయాయ నమః ఓం సోమజాయ నమః ఓం సుఖదాయ నమః ఓం శ్రీమతే నమః ఓం సోమవంశప్రదీపకాయ నమః ఓం వేదవిదే నమః ఓం వేదతత్త్వజ్ఞాయ నమః ఓం వేదాంతజ్ఞాన భాస్వరాయ నమః ఓం విద్యావిచక్షణ విభవే నమః ఓం విద్వత్ప్రీతికరాయ నమః ఓం బుధాయ నమః ఓం విశ్వనుకూలసంచారినే నమః ఓం విశేష వినయాన్వితాయ నమః

ఓం వివిధాగమసారజ్ఞానాయ నమః ఓం వీర్యవతే నమః ఓం విగతజ్వరాయ నమః ఓం త్రివర్గ ఫలదాయ నమః ఓం అనంతాయ నమః ఓం త్రిదశాదిపూజితాయ నమః ఓం బుద్దిమతే నమః ఓం బహుశాస్త్రజ్ఞాయ నమః ఓం బలినే నమః ఓం బంధవిమోచకాయ నమః ఓం వక్రాతివక్రగమనాయ నమః ఓం వాసవాయ నమః ఓం వసుధాధిపాయ నమః ఓం ప్రసాదవదనాయ నమః ఓం వంద్యాయ నమః ఓం వరేణ్యాయ నమః

ఓం వాగ్విలక్షణాయ నమః ఓం సత్యవతే నమః ఓం సత్యసంకల్పాయ నమః ఓం సత్యబంధవే నమః ఓం సదాదరాయ నమః ఓం సర్వరోగ ప్రశమనాయ నమః ఓం సర్వమృత్యునివారకాయ నమః ఓం వాణిజ్యనిపుణాయ నమః ఓం వశ్యాయ నమః ఓం వాతాంగినే నమః ఓం వాతరోగహృతే నమః ఓం స్థూలాయ నమః ఓం స్థిరగుణాధ్యక్షాయ నమః ఓం అప్రకాశాయ నమః

ఓం ప్రకాశాత్మనే నమః ఓం ఘనాయ నమః ఓం గగనభూషణాయ నమః ఓం విధిస్తుత్యాయ నమః ఓం విశాలాక్షాయ నమః ఓం విద్వజ్ఞనమనోహరాయ నమః ఓం చారుశీలాయ నమః ఓం స్వప్రకాశాయ నమః ఓం చపలాయ నమః ఓం చలితేంద్రియాయ నమః ఓం ఉదజ్ముఖాయ నమః ఓం మఖాసక్తాయ నమః ఓం మగధాధిపతయే నమః

ఓం హరయే నమః ఓం సౌమ్యవత్సర సంజితాయ నమః ఓం సోమప్రియకరాయ నమః ఓం సుఖినే నమః ఓం సింహాధిరూధాయ నమః ఓం సర్వజ్ఞాయ నమః ఓం శిఖపర్ణాయ నమః ఓం శివంకరాయ నమః ఓం పీతాంబరాయ నమః ఓం పీతవపుషే నమః ఓం పీతచ్ఛత్రద్వాజాంచితాయ నమః ఓం ఖడ్గచర్మధరాయ నమః

ఓం కార్యకర్త్రే నమః ఓం కలుషహారాకయ నమః ఓం ఆత్రేయ గోత్రజాయ నమః ఓం అత్యస్తవినయాయ నమః ఓం విశ్వపావనాయ నమః ఓం చాంప ఏయ పుష్పసంకాశాయ నమః ఓం చారణాయ నమః ఓం చారుభూషణాయ నమః ఓం వీతరాగాయ నమః ఓం వీరభాయాయ నమః ఓం విశుద్ధకనక ప్రభాయ నమః ఓం బంధుప్రియాయ నమః ఓం బంధముక్తాయ నమః ఓం బాణమండల సంశ్రితాయ నమః

ఓం తర్కశాస్త్ర విశారదాయ నమః ఓం ప్రశాంతాయ నమః ఓం ప్రీతిసంయుక్తాయ నమః ఓం ప్రియకృతే నమః ఓం ప్రియభాషణాయ నమః ఓం మేధావినే నమః ఓం మాధవాసక్తాయ నమః ఓం మిథునాధిపతయే నమః ఓం సుధీయే నమః ఓం కన్యారాశి ప్రియాయ నమః ఓం కామప్రదాయ నమః ఓం ఘనఫలాశ్రయాయ నమః

ఓం బుధగ్రహాయ నమః బుధ గ్రహ స్తోత్రమ్ అస్యశ్రీ బుధ స్తోత్ర మహామంత్రస్య వసిష్ట ఋషిః త్రిష్ణుప్భంద: శ్రీ బుధో దేవతా బుధగ్రహ ప్రసాద సిద్ద్యర్దే జపే వినియోగః భా మిత్యాది షడంగన్యాసః భూర్బువస్సురోమితి దిగ్భంధః ధ్యానమ్ బుధశ్చతుర్భిర్వరదాభయాసిగదా వహంతం వరదం ప్రశాంతమ్, పీతప్రభం చంద్రసుతం సురాధ్యం సింహేనిషణ్ణం బుధమాశ్రయామి. పీతాంబరం: పీరవపు: కిరీటీ ఛ చతుర్భుజ:

పీతధ్వజపతాకీ ఛ రోహిణీ గర్భసంభవః ఈశాన్యాధిషుదేశేషు బాణాసన ఉదాబ్ముఖః నాథో మగధదేశస్య మంత్రో మంత్రారథతత్త్వవితే. సుఖాసనః కర్ణికారో హైత్రశ్చాత్రే య గోత్రవాన్, భరద్వాజ ఋషి ప్రఖ్యైర్జ్యోతిర్మండలమండితః అడిపత్యదిదేవాభ్యామన్మతో గ్ర్రహమండలే, ప్రవిష్టస్సూక్ష్మ రూపేణ సమస్తవరదస్సుఖీ. సదా ప్రదక్షిణం మేరో: కుర్వాణః సంప్రాప్త సుఫలప్రదః కన్యాయా మిథునస్యాపి రాశేరథిపతిర్ధ్వయో:

ముద్గధాన్యప్రదో నిత్యం మార్త్యా మర్త్యసురార్చితః యస్తు సౌమ్యేన మనసా స్వమాత్మనం ప్రపూజయేత్, తస్య వశ్యో భవేన్నిత్యం సౌమ్యనామధరో బుధః బుధస్తోత్రమిదం గమ్యం వసిష్టోనోదితం పురా, దిలీపాయ ఛ భక్తాయ యాచమానాయ భూభ్రుతే. యః పఠేదేకవారం వా సర్వాష్టమవాప్నుయాత్, స్తోత్రరాజమిదం పుణ్యం గుహ్యాద్గుహ్యతమం మహత్.

ఏకవారం ద్వివారం వా త్రివారం యః పఠేన్నరః తస్యాపస్మారకుష్టాదివ్యాధిబాధా స విద్యతే. సర్వగ్రహకృతాపీడా పఠితే స్మిన్న విద్యతే, కృత్రి మౌషధదుర్మంత్రం క్రుత్రిమాదివిశాచరై: యదృద్భయం భవేత్తత్ర పఠితే స్మిన్ నవిద్యతే, ప్రతీమ యా ఛ స్వర్నేణ లీఖీతా తు భుజాష్టకా. మఉద్గదాన్యోపరి స్వప్తపీతవస్త్రాన్వితే ఘటే, విన్యస్య విధినా సమ్యక్ మాసమేకం నిరంతరమ్. యే పూజయంతి తే యాంతి దీర్ఘమాయు: ప్రజాధనమ్, ఆరోగ్యం భాస్మగుల్యాదిసర్వవ్యాధి వినాశనమ్. యం యం కామయత్ సమ్యక్ తత్తదాపొస త్యసంశయః ఇతి శ్రీస్కాందే పురాణే బుధస్తోత్రం సంపూర్ణమ్

బుధ దోషం – పరిహారము – శాంతులు

1. మీ దగ్గరలో నున్న విష్ణుమూర్తి దేవాలయమునకు వెళ్ళి ప్రతి బుధవారం ఉదయం 6 గంటల నుండి ఉదయం 7 గంటల వరకూ 170 ప్రదక్షిణలు చేయండి.

2. 17 బుధవారములు నవగ్రహములకు 170 ప్రదక్షిణలు చేసి 1.25 కే.జీ. పెసలు దానము చేయండి.

3. తూర్పుగోదావరి జిల్లాలోని ర్యాలీ దేవస్థానమునకు వెళ్ళి జగన్మోహిని స్వామిని ఒక బుధవారం దర్శించి అష్టోత్తర పూజ చేయించుకుంటే మంచిది.

4. బుధవారం రోజున పేదలకు పెసర హల్వా పంచిపెడితే మంచిది.

5. నరసింహ క్షేత్రములుగాని, విష్ణుమూర్తి క్షేత్రములుగాని దర్శించినప్పుడు పెసలు ఆకుపచ్చ వస్త్రములో దానము చేయండి.

6. కుడిచేతి వేలికి పచ్చ జాతిరత్నంతో బంగారపు ఉంగరం చేయించి పెట్టుకోండి.

7. బుధగ్రహ జపము ఒక మారు బ్రాహ్మణుడితో చేయించి పెసలు దానము చేయించండి.

8. నవగ్రహములలో బుధగ్రహమువద్ద బుధవారం 17 ఆకువచ్చ దారముల ఒత్తులతో దీపారాధన చేసి, ఆకుపచ్చ వస్త్రాన్ని దానము చేయండి.

9. 17 బుధవారములు ఉపవాసము వుండి చివరి బుధవారము విష్ణుమూర్తి పూజ మరియు బుధుని అష్టోత్తర పూజ చేయండి.

10. తమిళనాడులోని తిరువెంగకాడు దేవస్థానము దర్శించండి.

11. విష్ణుమూర్తి, గణపతి, నరసింహ ఆలయము నందు పేదలకు, సాధువులకు బుధవారము ప్రసాదాలు పంచి, అన్నదానము చేయండి.

12. బుధ ధ్యాస శ్లోకమును ప్రతిరోజు 170 మార్లు చొప్పున 170 రాజులు పారాయణ చేయండి.

13. బుధ గాయత్రి మంత్రమును 17 బుధవారములు 170 మార్లు పారాయణ చేయండి.

14. బుధ మంత్రమును 40 రోజులలో 17,000 మార్లు జపము చేయండి. ప్రతి రోజు విష్ణుసహస్ర నామ స్తోత్రము పారాయణ చేయండి.

15. తీరిక లేనివారు కనీసము బుధ శ్లోకము 17 మార్లుగాని, బుధ మంత్రమును 17 మార్లు పారాయణ చేయండి.

16. తొలి ఏకాదశి పర్వదినమున విష్ణు సహస్రనామ స్తోత్రమును 3 మార్లు పారాయణ చేయండి.


గురు గ్రహ

గురు గ్రహ దోషం ఉన్నవారు కింది సూచనలను పాటించి, శాంతి చేసుకోవాలి.
1.      ప్రతి గురువారం ఉదయం 6 గంటలనుండి ఉదయం 7 గంటల సమయంలో దగ్గరలో ఉన్న దత్తాత్రేయ దేవాలయానికి వెళ్ళి 160 ప్రదక్షిణలు చేయాలి.
2.      16 గురువారాలు నవగ్రహములకు 160 ప్రదక్షిణలు చేసి, పసుపు వస్త్రంలో ఐదు పావుల శనగలు పోసి, మూత కట్టి, దాన్ని దానం చేయాలి.
3.      గుంటూరు జిల్లాలోని చేబ్రోలు వెళ్ళి బ్రహ్మ దేవాలయము దర్శించాలి.
4.      గురువారం రోజున ఉడికించిన శనగలు పేదలకు పంచిపెట్టాలి.
5.      గుంటూరు జిల్లా అమరావతిలో అమరలింగేశ్వరుని, తూర్పు గోదావరి జిల్లాలో మందపల్లిలోని బ్రహ్మేశ్వరస్వామిని , కోటిపల్లిలోని కోటి లింగేశ్వరుని దర్శించి శనగలు దానం చేయాలి.
6.      కుడిచేతిచూపుడు వేలుకి కనకపుష్యరాగం ఉన్న బంగారు ఉంగరాన్ని ధరించాలి.
7.      బ్రాహ్మణుడితో గురు గ్రహ జపం చేయించి శనగలు దానం చేయాలి.
8.      గురువారం నాడు గురుగ్రహం వద్ద 16 పసుపు రంగు వత్తులతో దీపారాధన చేసి పసుపు వస్త్రాన్ని దానం చేయాలి.
9.      16 గురువారాలు ఉపవాసము ఉండి చివరి గురువారం దక్షిణామూర్తి పూజ, గురు అష్టోత్తర పూజ చేయాలి.
10.  తమిళనాడులోని అలంగుడి దేవాలయాన్ని దర్శించండి.
11.  శివ, సాయి, దత్త ఆలయాల్లో పేదలకు, సాధువులకు, ప్రసాదం పంచండి.
12.  ప్రతిరోజూ 160 మార్లు చొప్పున 160 రోజుల పాటు గురు ధ్యాన శ్లోకాన్ని పారాయణం చేయండి.
13.  16 గురువారముల పాటు గురు గాయత్రి మంత్రాన్ని 160 సార్లు పారాయణ చేయాలి.
14.  ప్రతిరోజూ దత్త శ్లోకాన్ని పారాయణ చేస్తూ, 40 రోజుల్లో 16.000 సార్లు గురు మంత్రాన్ని జపించండి.
15.  తీరిక లేనివారు కనీసం గురుశ్లోకములు 16 సార్లు లేదా గురు మంత్రాన్ని 160 సార్లు కాని పారాయణ చేయాలి.


16.  గురు పౌర్ణమి పర్వదినమున 18 సార్లు స్తవం పారాయణ చేయాలి.

Blog Archive