మన జీవితములు ఇచ్చాశక్తి మీద మరియు కర్మమీద ఆధారపడి ఉంటాయి. ఇచ్చాశక్తిని ఉపయోగించి మనము వస్తువును ఎన్నుకుంటాము. వస్తువును ఎన్నుకున్నతదుపరి మనము క్రియ చేస్తాం. మనజీవితములోని ఒడుదుడుకు లన్నిటికీ కేవలము మనము చేసే పనులే పూర్తిగా కారణము కాదు.
.
మనము క్రితం జన్మలలో చేసిన కర్మలఫలితముగా ఎన్నోఅనూహ్య సంఘట నలు మనజీవితములో చోటు చేసికుంటూఉంటాయి. కనుక మనజీవితములు కేవలము ఇచ్చాశక్తి కాక కర్మ మీద కూడా ఆధారపడిఉంటాయి.
జ్యోతిశ్శాస్త్రము ప్రకారము, తొమ్మిది గ్రహములు తమతమ స్థానమునుబట్టి స్థితిని కలుగజేస్తాయి. ఆయాస్థితిగతులనను సరించి జాతకునకు బట్టిన ఆయాకర్మలను, మరియు ఆయాకర్మల ప్రభావమును ఏ ఏ సమయములలో ఆ జాతకుడు అనుభవించ వలసి వచ్చునో చెప్పవచ్చు. ఉదాహరణకి శనియొక్క స్థానమునుబట్టి, మనము కూడగట్టిన చెడ్డ కర్మలను, ఆ కూడగట్టిన చెడ్డ కర్మలు మన జీవితములను ఏ విధముగా చెడుగా శాసించునో ఊహించవచ్చు. నవగ్రహములు మన జీవితములను శాసిస్తాయి లేదా ప్రభావితము చేస్తాయనటము సరిగాదు. నిజానికి మనకర్మలె మన జీవితములను శాసిస్తాయి లేదా ప్రభావితము చేస్తాయి. కాని నవగ్రహముల స్థానములు మన జీవితములను శాసిస్తాయి లేదా ప్రభావితము చేస్తాయి.
జ్యోతిశ్శాస్త్రము ఎంత గొప్పది అయిననూ దానిని సరిగ్గా అర్థము చేసుకొని ఆ నవగ్రహముల స్థానములను నిర్ణయం చేయుటకు నిష్ణాతుడైన జ్యోతిశ్శాస్త్ర పండితుడు అవసరము
- 8 ½ గంటలు = 1000 క్రియలు = 1000 సంవత్సరముల అభివృద్ధి
- 8 ½ గంటలు x 165 దినములు = 3,65,000 సంవత్సరముల అభివృద్ధి.
కనుక 10 లక్షల సంవత్సరముల అభివృద్ధిని 3 సంవత్సరములలో సాధించి ముక్తి పొందవచ్చు.
భౌతిక శరీరములోకాని, సూక్ష్మశరీరములోకాని, ఒకమనిషికి కేటాయించిన జీవితకాలము అతని కర్మానుసారము పూర్వనిర్దారితమై ఉంటుంది. పురోభివృద్ధి చెందిన క్రియాయోగి జీవితం పూర్వకర్మ ఫలితాల వల్ల కాక, కేవలం ఆత్మనిర్దేశాలవలనే ప్రభావిత మౌతుంది. ఈ ప్రపంచం యావత్తు ధ్రువత్వ నిరంకుశాదికారానికి లోబడి యున్నది. ఏ శాస్త్రమయినా స్వతః సిద్ధమయిన వ్యతిరేకసూత్రాలు లేదా విరుద్ధసూత్రాలు లేకుండా లేదు.
దేవుడు కుమారుడంటే మనిషిలోఉన్న కూటస్థలేక దివ్యచైతన్యం.
గంగాధరుడు అనగా వెన్నులో ఉన్న ప్రాణప్రవాహాము అనే నదిని అధీనములో ఉంచుకొన్నవాడు.
పూర్వజన్మలో యోహానే ఎలిజా. ఆ జన్మలో ఏసుక్రీస్తే ఎలీషా. ఎలీషా గురువు ఎలిజా.
ఈ జన్మలో ఎలీషాయే ఏసుక్రీస్తు. ఈ జన్మలో ఎలిజాయే జాన్. ఈ జన్మలో జాన్ ఏసుక్రీస్తు కి శిష్యుడు.
నాలుగు కులాల్లో ఏదో కులములో చేరడానికి పుట్టుకతో నిమిత్తం లేదు. జీవితములో మనము సాధించడానికి ఎంచుకున్న లక్ష్యము వలన అయే సహజ శక్తుల మీద ఆధారపడిఉంటుంది.