Translate

గురు గ్రహ

గురు గ్రహ దోషం ఉన్నవారు కింది సూచనలను పాటించి, శాంతి చేసుకోవాలి.
1.      ప్రతి గురువారం ఉదయం 6 గంటలనుండి ఉదయం 7 గంటల సమయంలో దగ్గరలో ఉన్న దత్తాత్రేయ దేవాలయానికి వెళ్ళి 160 ప్రదక్షిణలు చేయాలి.
2.      16 గురువారాలు నవగ్రహములకు 160 ప్రదక్షిణలు చేసి, పసుపు వస్త్రంలో ఐదు పావుల శనగలు పోసి, మూత కట్టి, దాన్ని దానం చేయాలి.
3.      గుంటూరు జిల్లాలోని చేబ్రోలు వెళ్ళి బ్రహ్మ దేవాలయము దర్శించాలి.
4.      గురువారం రోజున ఉడికించిన శనగలు పేదలకు పంచిపెట్టాలి.
5.      గుంటూరు జిల్లా అమరావతిలో అమరలింగేశ్వరుని, తూర్పు గోదావరి జిల్లాలో మందపల్లిలోని బ్రహ్మేశ్వరస్వామిని , కోటిపల్లిలోని కోటి లింగేశ్వరుని దర్శించి శనగలు దానం చేయాలి.
6.      కుడిచేతిచూపుడు వేలుకి కనకపుష్యరాగం ఉన్న బంగారు ఉంగరాన్ని ధరించాలి.
7.      బ్రాహ్మణుడితో గురు గ్రహ జపం చేయించి శనగలు దానం చేయాలి.
8.      గురువారం నాడు గురుగ్రహం వద్ద 16 పసుపు రంగు వత్తులతో దీపారాధన చేసి పసుపు వస్త్రాన్ని దానం చేయాలి.
9.      16 గురువారాలు ఉపవాసము ఉండి చివరి గురువారం దక్షిణామూర్తి పూజ, గురు అష్టోత్తర పూజ చేయాలి.
10.  తమిళనాడులోని అలంగుడి దేవాలయాన్ని దర్శించండి.
11.  శివ, సాయి, దత్త ఆలయాల్లో పేదలకు, సాధువులకు, ప్రసాదం పంచండి.
12.  ప్రతిరోజూ 160 మార్లు చొప్పున 160 రోజుల పాటు గురు ధ్యాన శ్లోకాన్ని పారాయణం చేయండి.
13.  16 గురువారముల పాటు గురు గాయత్రి మంత్రాన్ని 160 సార్లు పారాయణ చేయాలి.
14.  ప్రతిరోజూ దత్త శ్లోకాన్ని పారాయణ చేస్తూ, 40 రోజుల్లో 16.000 సార్లు గురు మంత్రాన్ని జపించండి.
15.  తీరిక లేనివారు కనీసం గురుశ్లోకములు 16 సార్లు లేదా గురు మంత్రాన్ని 160 సార్లు కాని పారాయణ చేయాలి.


16.  గురు పౌర్ణమి పర్వదినమున 18 సార్లు స్తవం పారాయణ చేయాలి.

Blog Archive