Translate

వాస్తు


వా స్తు


వాస్తు ఇంటి నిర్మాణంలో తీసికొనవలసిన నియమాలు నిబంధనలకి సంబంధించిన శాస్త్రము.   ఇంటి నిర్మాణంలో మూడు ముఖ్యవిషయములు గుర్తుంచుకొనవలయును.  గాలి, వెలుతురు మరియు నీరు బాగా వచ్చేటట్లు ఇంటి నిర్మాణం చేయవలయును. 

వంట ఇల్లు ఆగ్నేయం (SE) లోనూ, పెంట అనగా పాకీదొడ్డి నైఋతి దిక్కు (SW)లోనూ, పంట అనగా కూరగాయల మరియు పూలతోట   వాయువ్యం (NW) లోనూ, మంచినీటిగుంట అనగా బావి మరియు నీళ్ళ పంపు ఈశాన్యం (NE) లోనూ ఉండేటట్లు చూసుకోవాలి. 

కిటికీలు మరియు తలుపులు సరి సంఖ్యలోనూ ఉండేటట్లు చూసుకోవాలి.అట్లా అని సరి సంఖ్యలో ఉండాలికదా అని చివర సున్నా ఉండకూడదు.  అనగా కిటికీలు మరియు తలుపుల సంఖ్య 10, 20 మరియు  30  వగైరా  అట్లా ఉండకూడదు.

ఎటువంటి జాతకులకైనా  ఇంటి లోనికి పడమరనుండికాని, దక్షిణం నుండికాని ప్రవేశము అన్నివిధాలా మంచిది. 
అదేవిధముగా తల దక్షిణమున గాని, పడమర వైపు గాని పెట్టుకొని నిద్రించవలయును.  అనగా మనము తూర్పుగాని ఉత్తరముగాని చూస్తూ నిద్రించుట ఉత్తమము.  ఉత్తరదిక్కున తలపెట్టుకొని నిద్రించకూడదు. ఎందుకంటే మనతల ఉత్తరము, పాదములు దక్షిణము. భూమి ఒక అయస్కాంతం లాంటిది. భూమియొక్క ఉత్తరదిక్కున తలపెట్టుకొని పడుకున్న యడల, మనతల ఉత్తరము మరియు భూమియొక్క ఉత్తరము వికర్షణ చెంది తలకాయ నొప్పులు, కలలు, రక్తపోటు రావడం వగైరా వగైరా వస్తాయి.
    
నైఋతి(SW) వైపు బరువు అనగా సామానులు అవీ పెట్టుకునేందుకు కావలసిన అల్మైరాలు అవీ కట్టుకొనవలయును. 

పడమర దిక్కున కట్టుకునే గోడ తూర్పు దిక్కుకంటే ఎత్తగా ఉండవలయును.

మనము కూర్చొని ధ్యానము చేసే పూజగది తప్పక ఉండవలయును. దేవుని విగ్రహములు పడమరను చూస్తూ వాటి ఎదుట మనము తూర్పును చూస్తూ ఉండేటట్లుగా కూర్చొని ధ్యానము చేసేటట్లుగా ఉండవలయును.
ఎన్నిగదులున్న గదికి ఒక్కడు చొప్పున అంతమంది ఆ ఇంట్లో రోజూ భోజనము చేయవలయును. లేనియడల గ్రహశాంతి మరియు గృహశాంతి రెండూ కరువగును. కనుక ఎక్కువ గదులున్నయడల అద్దెకిచ్చుకోనుట ఉత్తమము.




 

వాస్తు శాస్త్రము

1 మనము కొత్తగా ఇల్లు కట్టుకున్నప్పుడు వాస్తు విషయాలను తప్పక పా టింపవలయును. గాలి, వెలుతురు, నీరు మొదలగునవి మన ఇంటిలో నికి ఆహ్వానించే విధంగా మనము ఇంటి నిర్మాణము చేయవలెను.


2 మనము స్థలము కొనుగోలు చేయునపుడు నలు చదరముగా గాని, సమకోణ దీర్ఘ చతుర స్రాకారముగ ఉన్న స్థలంగాని ఎంపిక చేసుకోవాలి. అది తూర్పు, ఉత్తరం పల్లంగా వుండాలి. ఈశాన్యం పల్లంగా ఉన్న స్థలం చాల మంచిది. 3 ఇంటికి చుట్టు ప్రహరి ఉండుట చాల మంచిది.


4 ఇల్లు కట్టుకొనే ముందు ఇంటికి చూట్టూ ఖాళీ స్థలం వుంచుకోవాలి. తూర్పు, ఉత్తరాలతో ఎక్కువ ఖాళీ స్థలం ఉంచుకొనుట చాలా మంచిది .


5 ఈశాన్యం పెరిగిన స్థలం చాలా మంచిది. ఈశాన్యం ఎంత పెరిగితే అంత మంచిది . ఈశాన్యం కాకుండా ఏ మూల పెరిగినా దానిని తగించే వీలు వుంటెనే ఆ స్థలాన్ని తీసుకోవాలి.


6 స్థలము, గృహాలతో నిగదులు తూర్పు భాగమునకు పల్లముగా ఉండాలి. మనము వాడిన నీరు తూర్పునకు గాని, ఈశాన్యానికి గానీ వెళ్ళే విధంగా కట్టుకోవాలి.


7 ఇంటికి ద్వారాలు తూర్పులోనూ, ఉత్తరములోనూ, ఉత్తరములోనూ, ఈశాన్యాలలోనూ, దక్షిణ ఆగ్నేయం, పశ్చిమ వాయువ్యంలో ఉంటె మంచిది. ఉత్తర వాయువ్యాలలో, తూర్పు ఆగ్నేయంలో, దక్షిణ నైరుతి లో మరియు పశ్చిమ నైరుతి లో ద్వారాలు ఉండకూడదు.


8 . వంటగది నిర్మాణము ఈశాన్య భాగమున ఉండరాదు. ఈశాన్యం మూల పొయ్యి అసలు ఉండరాదు. ఇంటిలో పొయ్యి ప్రధానంగా ఆగ్నేయంలో ఉండాలి. అలా వీలు కుదరనప్పుడు నైరుతి భాగములో పెట్టవచ్చును. మిగతా దిశలు పొయ్యికి పనికి రావు.


9 . ఇంటిలో ఈశాన్య భాగములో పూజా మందిరం నిర్మించుట చాలా మంచిది.


10 .పడక గది నైరుతి భాగములో కట్టుకోవాలి. దక్షిణం వైపు తల ఉంచి నిదురించుట చాలా మంచిది. ఎట్టి పరిస్థితులలోను ఉత్తరం వైపు తల ఉంచి నిదురించ కూడదు.


11 . గొయ్యి లేకుండ ఉండేటటువంటి మరుగు దొడ్డి ఆగ్నేయంలో నిర్మించు కొనుట చాలా మంచిది. సెప్టిక్ టాంకులు తూర్పు, ఉత్తరాలలో కట్టుకొనవచ్చును. లెట్రిన్ లో తూర్పు ముఖంగాను, పడమర ముఖంగాను కూర్చోన కూడదు. ఈశాన్యములో మరుగు దొడ్డి అసలు ఉండకూడదు.





Blog Archive