Translate

గ్రహములు - గ్రహాధిపతులు - వర్ణములు - గుణములు

రాశులు --- గ్రహాధిపతులు

రాశులు  గ్రహములయొక్క ఆధిపత్యముతో పనిచేయును.

రాశులు మొత్తం కలిపి 12. 12 రాశులను సూర్యుడు మరియు చంద్రుడుకి  పంచారు. తరువాత సూర్యుడికి కటక(Cancer)రాశి,   చంద్రుడికి చంద్రుడుకి సింహ(Leo) రాశి పంచారు.  అనగా సూర్యుడికి మరియు చంద్రుడుకి ఒక్కొక్క రాశి చొప్పున ఇచ్చారు.  మిగిలిన ఐదు గ్రహములకు ఒక్కొక్క గ్రహమునకు రెండు రాశులచొప్పున మిగిలిన పది రాశులను  పంచారు.. ఛాయా గ్రహములయిన రాహు కేతువులకు ప్రత్యేకముగా ఏ గ్రహమునూ ఇవ్వలేదు.  కానీ ఈ రెండు గ్రహములూ ఏ గ్రహముతో కలిసి ఏ ఇంట్లో ఉంటే దానికి తగిన ఫలితాలు కలుగుతాయి.  అనగా ఈ రెండు గ్రహములూ స్వయం ప్రకాశితములు కావు.


రాశి                                               గ్రహాధిపతి

(1)మేష(Aeries), (8)వృశ్చికం (Scorpio)-- అంగారక లేక కుజ

(2)వృషభము (Taurus), (7)తుల (Libra)................................శుక్ర

(3)మిథున(Gemini), (6)కన్య(Virgo)……………..............బుధ

(4)కటక(Cancer)...................................................................................చంద్ర

(5)సింహ(Leo) ....................................................................................సూర్య

(12)మీన(Pisces),(9)ధనుస్సు(Saggitarus)..గురు లేక బృహస్పతి

(10)మకర(Capricorn), (11)కుంభ (Aquarius)………......శని


 గ్రహములు మంచి చెడు అని రెండు విధములుగా ఉండును.

  • గురు లేక బృహస్పతి, శుక్ర, వృద్ధి చంద్ర, ,బుధుడు(well associated) సౌమ్యులు.


  • రవి, శని, కుజ, రాహు, కేతువులు , క్షీణ చంద్రుడు, పాపులతో కూడిన బుధుడు( badly associated)  పాపులు.


చంద్రుడు అమావాశ్య 8వ రోజునుండి పౌర్ణమి వెళ్ళిన 8వ రోజు వఱకు బలముగా ఉంటాడు.
చంద్రుడు పౌర్ణమి వెళ్ళిన 8వ రోజునుండి అమావాశ్య 8వ రోజు వఱకు బలహీనముగా ఉంటాడు.


రాశులు కౄరజాతులు, సౌమ్యజాతులు అని రెండు విధములుగా ఉండును.

  • (1)మేష (Aeries), (3)మిథున (Gemini), (5)సింహ(Leo), (7)తుల (Libra), (9)ధనుస్సు(Saggitarus), (11)కుంభ(Aquarius) రాశులు కౄర జాతులు.


  • (2)వృషభము (Taurus), (4)కటక(Cancer), (6)కన్య(Virgo),(8)వృశ్చికం(Scorpio),(10)మకర(Capricorn), (12)మీన(Pisces) రాశులు సౌమ్యజాతులు.


కానీ రాశులు శుభగ్రహముల అధీనములో ఉన్నప్పుడు కౄరములు కానేరవు.
అలాగే రాశులు కౄరగ్రహముల అధీనములో ఉన్నప్పుడు శుభములు కానేరవు.

         గ్రహములు - వర్ణములు - ఇతర గుణములు

గురు లేక బృహస్పతి, శుక్రుడు ----బ్రాహ్మణులు
రవి, కుజులు-----------------------క్షత్రియులు
చంద్ర, బుధులు---------------------వైశ్యులు
శని----------------------------------శూద్రుడు.

రవి, కుజ, గురు లేక బృహస్పతి -------------పురుషులు
చంద్రశుక్రుడు----------------------------------స్త్రీలు
బుధ, శని----------------------------------------నపుంసకులు

రవి, చంద్ర, గురు లేక బృహస్పతి------సాత్వికులు
బుధ, శుక్రుడు-----------------రాజసులు
కుజ, శని-------------------------------తామసులు
రవి-------------------------ఆత్మ
చంద్ర-----------------------మనస్సు
కుజుడు---------------------వీరుడు, పరాక్రమము
బుధుడు....................వ్యాపారకారకుడు
గురు లేక బృహస్పతి--------జ్ఞానం, సుఖము, విద్య, వేదాంతం
శుక్ర-------------------------వీర్యము
శని--------------------------కౄరదృష్టిగలవాడు, దుఃఖదుడు

రవి, చంద్ర ---------------------------రాజులు
కుజుడు--------------------------------సేనాపతి
బుధుడు--------------------------------రాజకుమారుడు
గురు లేక బృహస్పతి, శుక్ర--------------మంత్రులు
శని--------------------------------------సేవకుడు
రాహు  కేతువులు------------------------సేన

లగ్నము

రాశుల ఉదయమే లగ్నము.  అనగా ఉదయించు రాశికి  లగ్నము అంటారు.  అనగా జన్మ సమయమున తూర్పును చూస్తున్న రాశిని లగ్నము అంటారు. ఈ లగ్నవశమున గ్రహములు శుభ లేక అశుభ ఫలితములు ఇచ్చును.

గ్రహములు ఈవిధంగా ఉంటాయి. 

రవి(sun)  ---తరువాతబుధ(Mercury) – తరువాత శుక్ర (Venus) ---- తరువాత  పృ థ్వి (Earth )---- తరువాత  కుజ (Mars )-- తరువాత  గురు(Jupiter )---- తరువాత   శని (Saturn)


 రాహు మరియు కేతు అనునవి ఛాయా గ్రహములు.


Blog Archive