Translate

గ్రహ దోషాలు




  • కుజ దోషము



  • శని దోషము




  • కాలసర్పదోషము:
మేషాది రాశులలో రాహు కేతువులు స్థితులై ఆరెండు గ్రహముల మధ్యలో మిగతాగ్రహములు ఉన్నచో దానిని కాలసర్పదోషము అందురు. అట్లుగాక మీనాది రాశులలో రాహు కేతువులు స్థితులై ఆరెండు గ్రహముల మధ్యలో మిగతాగ్రహములు ఉన్నచో దానిని విపరీత కాలసర్పదోషము అందురు.
ఈ కాలసర్పదోషమునే కొందరు విజ్ఞులు కాలసర్పయోగం అని కూడా చెప్పుచున్నారు.
సహస్రారచక్రమును టెన్స్ చేసి ఆచక్రములో రామ్   అనే  బీజాక్షరధ్యానము, ఫిజన్ మరియు ఫ్యూజన్ పద్ధతుల ప్రాణాయామ పద్ధతుల ద్వారానూ , దీర్ఘప్రాణాయామ పద్ధతుల ద్వారానూ, సహస్రారచక్రమును టెన్స్ చేసి ఆచక్రములో 108 సార్లు ఓం ఉచ్ఛరించిన   ఆ లోపమును సమూలముగా నిర్మూలించవచ్చు.

శుభగ్రహములైన గురు, శుక్ర(venus), బుధుడు(mercury), చంద్రుడు కేంద్రములందు ఉన్నయడల సామాన్యఫలితము మాత్రమే ఇచ్చును. ఉభయ కేంద్రాధిపత్యముపట్టిన గురు శుక్రులు విపరీత దుష్ఫలితములు ఇచ్చును. బుధ చంద్రులు సామాన్య దుష్ఫలితములు ఇచ్చును. ఉభయ కేంద్రాధిపత్యముపట్టిన గురు శుక్రులు మరియొక కేంద్రములో  స్థితులై ఉన్నచో ఇంకనూ మిక్కిలి దుష్ఫలితములు ఇచ్చును.

    
 ముఖ్య విషయములు

రెండు పాపగ్రహములమధ్య  శుభగ్రహం ఉన్నా, లగ్నము ఉన్నా పాపకర్తరి అందురు.

రెండు శుభగ్రహములమధ్య  పాపగ్రహం ఉన్నా, లగ్నము ఉన్నా శుభకర్తరి అందురు.

గ్రహ దోషాలు వాటికి సంబంధించిన ధాన్యాలు

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి గ్రహానికీ వాటికి సంబంధించిన ధాన్యాలున్నాయి. ఎవరికైనా జాతక చక్రంలో దోషాలేవైనా వున్నా, గ్రహ దోషాలవల్ల అనారోగ్యంపాలయినా, ఆ గ్రహాలకి సంబంధించిన ధాన్యాలను దానం చెయ్యటం, తినటం వల్ల ఆ దోషాలు పోతాయని, స్వస్ధత చేకూరుతుందనీ అందురు.

  • రవి -- గోధుమలు
  • చంద్రుడు -- బియ్యం
  • కుజుడు -- కందులు
  • బుధుడు -- పెసలు
  • గురువు -- శనగలు
  • శుక్రుడు -- బొబ్బర్లు
  • శని -- నువ్వులు
  • రాహువు -- మినుములు
  • కేతువు -- ఉలవలు


ఇలా గ్రహాలకు చెందిన లేదా పొంత ఉన్న వస్తువులు గ్రహాల వల్ల కలిగే అనారోగ్యాలను తొలగిస్తున్నాయి. విశేషించి ఆయా గ్రహాలు ఉచ్ఛ స్వక్షేత్రాదులలో బలంగా ఉన్నప్పుడు ఆయా పంటలు ఎ క్కువగా పండి దేశ ప్రజలందరికీ అందుబాటులో ఉంటున్నాయి.

శాంతి మార్గాలు కేవలం శాస్త్రంలో కొంతవరకే ఉంటాయి. వాటిని పురాణాలు, వైదిక సంప్రదాయాలు మంత్ర శాస్త్రం బాగా తెలిసిన వారు జ్యోతిశ్శాస్త్రంతో ముడిపెట్టి ఎన్నో మార్గాలు తెలియజేశారు. దీనికి ప్రధానమైన ఆధారం జ్యోతిశ్శాస్త్ర గ్రంథాలలో రవి ఈశ్వరారాధన చేస్తారు. చంద్రుడు గౌరీ ఉపాసకులు. కుజ దిశ సుబ్రహ్మణ్యం అధిదేవత అనియు, బుధుడికి విష్ణువు ఆరాధ్య దైవము అని, గురువుకు శివుడు, శుక్రుడికి లక్ష్మీ ఉపాసన, శనికి శివారాధన, రాహువుకు దుర్గ, కేతువుకు గణపతి అని చెప్పబడింది. దీని ఆధారంగా వివిధమైన విధానాలు పెద్దలు, మహర్షులు వ్యవస్థ చేశారు. విష్ణుమూర్తి సృష్టి పరిపాలకుడు. ఆయన పరిపాలనకు గాను తన అనుచరులుగా ఈ నవగ్రహాలను ఉంచారు. అంవలన సృష్టి పాలకులయిన హరిహరులను నిత్యం అర్చించడం నవగ్రహాలకు యధోచిత సేవ చేయడం చాలా శ్రేయస్కరమయిన అంశం. నిత్యం నవగ్రహ స్తోత్ర పారాయణ, నవగ్రహాలకు 11 ప్రదక్షిణాలు చేయడం వంటివి అవసరం. ఇది కనీస శాంతి మార్గం. సాధారణంగా ఆరోగ్య సమస్యలు నడిచే విషయంలో సూర్య నమస్కారాలు అరుణ పారాయణ చేయించడం ఒక విధి. రవి దశ, గురు దశ, శని దశ, కేతు దశ నడిచేటప్పుడు ఇది బాగా పని చేస్తుంది. చంద్రగ్రహం వలన వచ్చే ఆరోగ్య సమస్యలకు సూర్య నమస్కారాలతోపాటు దుర్గా అనుష్ఠానం చేయించాలి. అలాగే కుజ దశ నడిచే సందర్భంలో సుబ్రహ్మణ్య ఆరాధన, బుధ దశ విషయంలో లక్ష్మీనృసింహానుష్ఠానం, శుక్ర దశలోనూ కేతు దశలోనూ లక్ష్మీ నృసింహానుష్ఠానం, శనితో సంబంధంగా ఆరోగ్య సమస్యలు వున్నప్పుడు మృత్యుంజయ జపం, రాహువుతో సంబంధంగా ఆరోగ్య సమస్యలకు దుర్గా అనుష్ఠానం శ్రేయస్కరం. అలాగే మృత్యుప్రదము అయిన ఆరోగ్య సమస్యలు తీవ్రంగా బాధించే సమయంలో నిత్యం మృత్యుంజయ పాశుపతంచేయించడం శ్రేయస్కరం అని పురాణవేత్తలు చెబుతారు. వివాహం: వివాహం ఆలస్యం, ప్రయత్నాలలో చికాకులు విషయంగా రవితో సంబంధం అయిన సందర్భంలో శివ కల్యాణం చేయించడం, నిత్యం శివాలయంలో శివారాధన చేయడం, చంద్రుడితో దోషం వున్నప్పుడు గిరిజా కళ్యాణం చేయించడం మరియు సుబ్రహ్మణ్య పూజలు చేయడం, బుధ గ్రహంతో దోషం వున్నప్పుడు రుక్మిణీ కళ్యాణం ఘట్టం రోజూ పారాయణ చేయడం అలాగే కుదిరినప్పుడు శ్రీనివాస కళ్యాణం చేయించడం, గురువుతో వివాహ విషయమై దోషం వున్నప్పుడు శివ కల్యాణం చేయించి పంచాక్షరీ మంత్రానుష్ఠానం చేయించడం. శుక్ర సంబంధమయిన దోషంతో వివాహ ప్రతిబంధకాలు వున్నవారు రుక్మిణీ కళ్యాణం పారాయణ చేయడం లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం పారాయణ చేయడం అవసరం. శని దోషంగా ఉండి వివాహ విషయంగా ప్రతిబంధకాలు ఉన్నప్పుడు శివ కళ్యాణం చేయించి నిత్యం రామనామం చెబుతూ ఆంజనేయ స్వామికి 108 ప్రదక్షిణలు చేయడం, రాహువుతో వివాహ విషయంగా ప్రతిబంధకాలు వున్నప్పుడు పార్వతీ కళ్యాణం చేయించి రోజూ దుర్గా సప్తశ్లోకా పారాయణ మరియు లలితా సహస్ర పారాయణ చేయడం, కేతువుతో దోషం చెప్పబడినప్పుడు విఘ్నేశ్వరుడికి చతురావృత్తి తర్పణాలు చేయించి నిత్యం లక్ష్మీ నృసింహ స్తోత్ర పారాయణ చేయడం శ్రేయస్కరం. అయితే ఏ గ్రహ సంబంధమయిన దోషం వున్నా కన్యాపాశుపతంచేయిస్తారు. గ్రహ సంబంధమైన ఏ విధమైన దోషం వున్ననూ నిత్యం నవగ్రహాలకు ప్రదక్షిణలు 11 చేసి అనంతరం శివుడికి 11 ప్రదక్షిణలు చేసి శివసన్నిధిలో విష్ణు సహస్ర నామ పారాయణ చేయడం సర్వదా శుభం అని పెద్దల వాదన. దీనికి కారణం సృష్టి పరిపాలకులు గ్రహ గమన నిర్దేశకులు హరిహరులు సంతృప్తి నొందితే సత్వరం మంచి ఫలితాలు ఉంటాయి. పై శాంతి చేయించడం ద్వారా జాతకంలో రాసి వున్న వివాహ దశలు కాలము మారవు. ప్రయత్నాలలో అవరోధాలు చికాకులు తొలగుతాయి. ఇక విద్యా విషయంగా పరిశీలిస్తే రవి దోషంగా వున్ననూ అనుగ్రహం కావలసి వచ్చినను గురు శని విషయంలో కూడా దక్షిణా మూర్తి ఆరాధన త్వరగా సత్ఫలితాలను ఇస్తుంది. చంద్రగ్రహ విషయంలో బాలానుష్ఠానం, కుజ గ్రహ విషయంలో సుబ్రహ్మణ్య ఆరాధన, బుధ గ్రహ విషయంలో హయగ్రీవోపాసన, శుక్రగ్రహ విషయంలో హయగ్రీవోపాసన, రాహు గ్రహ విషయంలో బాలామంత్రానుష్ఠానం, కేతువు గ్రహ విషయంలో శ్రీవిద్యా గణపతి అనుష్ఠానం చెబుతారు. అయితే ఈశానస్సర్వ విద్యానాంఅనే వేద వాక్యం ఆధారంగా ఓం నమశ్శివాయశివ షడక్షరీ మంత్రానుష్ఠానం దీక్షగా మెడిటేషన్ చేసిన వారికి విద్యా విజ్ఞాన యోగం తప్పక లభిస్తుంది.

పిల్లలు సరిగా మాట వినకపోయిననూ, సరియగు దారిలో లేకున్ననూ, విద్యా ఉద్యోగ వివాహ విషయములలో సమస్యలతో వున్ననూ శ్రీరామ శ్శరణం మమఅని 108 ప్రదక్షిణలు ఆంజనేయ స్వామికి ప్రతిరోజూ చేయడం ద్వారా తల్లిదండ్రులు సత్ఫలితాలు అందుకుంటారు.
ఉద్యోగ విషయంలో రవి గురు శని దోషం ఉంటే పాశుపతి అభిషేకం చేయించి ప్రదోష కాలంలో శివాలయంలో చండీ ప్రదక్షిణలు చేయాలి. చంద్ర శుక్ర రాహు దోషం ఉంటే చండీ సప్తశతీ పారాయణ, కుజగ్రహ దోషం ఉంటే సర్పసూక్తంతో అభిషేకం, బుధ కేతు గ్రహ దోషం ఉంటే లక్ష్మీ గణపతి అనుష్ఠానం శ్రేయస్కరం.

సంతానం కొరకు పురాణాలలో చాలా విశేషములు ఉన్నాయి. శ్రీకృష్ణ పరమాత్మ వ్యాస మహర్షి మొదలగు వారు సంతానం కొరకు శివారాధన చేసినట్లు పురాణాలలో చెప్పబడింది. సంసారంలో చికాకులు తొలగి భార్యాభర్తల మధ్య అన్యోన్యం పెరుగుటకు శివకామేశ్వరాంకస్టా శివాస్వాధీన వల్లభాఅనే వాక్యం లలితా సహస్రంలో ప్రతి శ్లోకానికి ముందు వెనుక చెప్పి మూడు కాలాలతో చేయుట ద్వారా మంచి ఫలితాలు త్వరగా సిద్ధిస్తాయి. ఎన్నో విశేషములు జ్యోతిశ్శాస్త్రం పురాణాలు తెలిసిన వారు కలిసి చెప్పినవి మన పూర్వీకుల నుండి ఆచరణలో వున్నవి.


Blog Archive