జ్యోతిష్యము
రాశులు మొత్తం కలిపి 12. ఈ 12 రాశులు కలిపి
భచక్రము అంటారు. అద్భుతమైన కాంతి వృత్తమే భచక్రము. దానికి మొదలు చివరా ఉండదు. ఆది అంతము
లేదు. కొలత కోసరము ఒక astronomical point అవసరము అనగా
ఒక మొదలు అంటూ ఉండాలి లేదా
ఏర్పరచుకోవాలి.
27 నక్షత్రములు
కలిగినది ఈ భచక్రము.
ఈ భచక్రము లేదా జాతకచక్రము 360డిగ్రీలుగా ఉంటుంది.
ఒక్కొక్క రాశికి 30 డిగ్రీలు
ఇచ్చుకుంటూ 12 రాశులకూ కలిపి 360డిగ్రీలుగా ఉంటుంది.
ఒక్కొక్క రాశి ఒక్కొక్క ఇల్లు. ఈ ఇళ్ళలో
ఉంటాయి గ్రహాలు. గ్రహములకు స్థిరమయిన
ఇల్లు ఉండవచ్చు. ఉండక పోవచ్చు. ఈ భచక్రము మేష(Aeries) రాశితో మొదలయ్యి మీన(Pisces) రాశితో పూర్తి అగును. అశ్వని నక్షత్రముతో
మొదలయ్యి, రేవతి నక్షత్రముతో పూర్తి
అగును.
ఈ భచక్రము ఇరువది ఏడు నక్షత్రములతో
కూడి ఉంటుంది. అవి.......
1)అశ్వని,
2) భరణి,
3) కృత్తిక,
4) రోహిణి,
5) మృగశిర,
6) ఆరుద్ర,
7) పునర్వశు,
8) పుష్యమి,
9) ఆశ్లేష,
10) మఖ ,
11) పూర్వఫల్గుణి,
12) ఉత్తర,
13) హస్త,
14) చిత్త,
15) స్వాతి,
16) విశాఖ,
17) అనూరాధ,
18) జ్యేష్ఠ
19) మూల,
20) పూర్వాషాఢ,
21) ఉత్తరాషాఢ,
22) శ్రవణం,
23) ధనిష్ఠ,
24) శతభిషం,
25) పూర్వాభాద్ర,
26) ఉత్తరాభాద్ర
27) రేవతి .
ఒక్కొక్క నక్షత్రమును నాలుగు
పాదములుగా విభజించారు. 27 నక్షత్రములను 27x4=108 పాదములుగా
విభజించారు. ఈ 108 పాదములను
ఒక్కొక్క రాశికి తొమ్మిది పాదముల వంతున 12 రాశులకు ఇవ్వబడినవి..
గ్రహములు, రాశులు పరస్పర
సంబంధము కలిగిఉంటవి. ఈ రాశులను గ్రహములు
శాసిస్తూఉంటాయి.
రాశి పేరు (Sign)
నక్షత్రములు
1) మేష..... Aeries-----------అశ్వని , భరణి , కృత్తిక(మొదటి పాదము)
2)వృషభ......Taurus----------కృత్తిక(2,3,4పాదములు),రోహిణి,
మృగశిర(1,2 పాదములు)
3)మిథున……Gemini----------మృగశిర(3,4పాదములు), ఆరుద్ర,
పునర్వసు(1,2,3 పాదములు)
4) కటక….Cancer----------పునర్వసు(4వపాదము), పుష్యమి, ఆశ్లేష
5) సింహ.....…..Leo-----------మఖ, పూర్వఫల్గుణి లేదా పుబ్బ, ఉత్తర(1వపాదము)
6) కన్య..........Virgo--------ఉత్తర (2,3,4పాదములు),, హస్త, చిత్త(1,2 పాదములు),
7)తుల........Libra----------చిత్త(3,4పాదములు), స్వాతి,
విశాఖ (1,2,3 పాదములు),
8) వృశ్చిక
.........Scorpio----------విశాఖ(4వపాదము), అనూరాధ,
జ్యేష్ఠ,
9) ధనుస్సు ........Saggitarus------మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ (మొదటి పాదము),
10)మకర..........Capricorn.......ఉత్తరాషాఢ(2,3,4పాదములు), శ్రవణం,
ధనిష్ట, (1,2పాదములు),
11)కుంభ............Aquarius-----------ధనిష్ట(3,4పాదములు), శతభిషం, పూర్వాభాద్ర, 1, 2, 3 పాదములు)
12) మీన........ Pisces ----------పూర్వాభాద్ర, (4వపాదము),ఉత్తరాభాద్ర,
& రేవతి.
ఈ క్రింద పొందుపరచిన విషయములు జాతకుడి ప్రవర్తన మరియు మానసిక ప్రవృత్తి
గురించి తెలుసుకొనుటకు ఉపయోగపడును.
జన్మ లగ్నముతో ఈ రాశులు 1,2,3 అని లెక్కింపు మొదలగును.
1) 1,4,7,10 రాశులను, నాలుగింటినీ కలిపి
చతుష్టయములు లేదా కేంద్రములు (quadrants) అంటారు.
2) 1,5,9 రాశులను
రెండింటినీ కలిపి కోణములు (trines) అంటారు.
3) మేషం(Aeries), కటక, తుల, మకర రాశులను, ఈ నాలుగూ చరరాశులు
అంటారు.
4) వృషభం, సింహం, వృశ్చికం , కుంభం ఈ నాలుగూ స్థిర రాశులు అంటారు.
*5) మిథునం, కన్య, ధనుస్సు, మీనం ఈ నాలుగూ మూల
రాశులు అంటారు.