Translate

నవ గ్రహ

నవ గ్రహ శ్లోకం :

ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ
గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః

రవి: 6000 సార్లు
జపాకుసుమ సంకాశం, కాస్యపేయం మహాద్యుతిం,
తమోరిం సర్వ పాపఘ్నం, ప్రణతోస్మి దివాకరం.

చంద్ర: 10,000 సార్లు
దధి శంఖ తుషారాభం, క్షీరో దార్ణవ సంభవం,
నమామి శశినం సోమం, శంభోర్మకుట భూషణం.

కుజ: 7,000 సార్లు
ధరణీ గర్భ సంభూతం, విద్యుత్ కాంతి సమప్రభం,
కుమారం శక్తి హస్తం, తం మంగళం ప్రణమామ్యహం.

బుధ: 17,000 సార్లు
ప్రియంగు కలికా శ్యామం, రూపేణా ప్రతిమం బుధం,
సౌమ్యం సత్వ గుణేపేతం, తం బుధం ప్రణమామ్యహం.

గురు: 16,000 సార్లు
దేవానాంచ ఋషీణాంచ, గురుం కాంచన సన్నిభం,
బుద్ధి మంతం త్రిలోకేశం, తం నమామి బృహస్పతిం.

శుక్ర: 20,000 సార్లు
హిమకుంద మృణాళాభం, దైత్యానాం పరమం గురుం,
సర్వ శాస్త్ర ప్రవక్తారం, భార్గవం ప్రణమామ్యహం.

శని: 19,000 సార్లు
నీలాంజన సమాభాసం, రవిపుత్రం యమాగ్రజం,
ఛాయా మార్తాండ సంభూతం, తం నమామి శనైశ్చరం.

రాహు: 18,000 సార్లు
అర్థకాయం మహావీరం, చంద్రాదిత్య విమర్ధనం,
సింహికా గర్భ సంభూతం, తం రాహుం ప్రణమామ్యహం.

కేతు: 7,000 సార్లు
ఫలాశ పుష్ప సంకాశం, తారకా గ్రహ మస్తకం,
రౌద్రం రౌద్రాత్మకం ఘోరం, తం కేతుం ప్రణమామ్యహం.

ఈ నవగ్రహ శ్లోకాలు ఎవరైనా పఠించవచ్చు. పైన గ్రహ శ్లోకాలు వాటి ప్రక్కనే చేయవలసిన జపసంఖ్య చెప్పడం జరిగింది. ఒక్కో సారి పరిస్ఠితుల తీవ్రతను బట్టి 2,3 లేక 4 గ్రహాలకు కూడా జపాలు చేసుకోవలసి రావచ్చు. ఆ జపసంఖ్యను పూర్తిచేయడానికి చాలాసమయం పడుతుంది కనుక ఒకేరోజులో పూర్తిచేయవలసిన అవసరం లేదు. కొన్ని రోజులు ( ఉదా: 3 లేదా 5 లేదా 9 లేదా 11 లేదా 21 లేదా 41) నియమం పెట్టుకుని రోజుకి కొంత పూర్తి చేసుకుని, ఆ గ్రహానికి ఇష్టమైన ధాన్యం ఇష్టమైన వారంలో దానం చేయడం ద్వారా ఆశించిన ఫలితాలను పొందవచ్చు. నవ గ్రహాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే నవ గ్రహాలను ప్రార్ధించడం ద్వారా ధర్మ బద్ధమైన మీ కోరిక ఎంతటిదైనా ఖచ్చితంగా తీరుతుంది. ముందుగా మీకున్న సమస్య ఏమిటో, దాన్ని తీర్చగలిగే శక్తి ఏ గ్రహానికుందో తెలుసుకోవటానికి అనుభవజ్ఞులైన జోతీష్యులను సంప్రదించి వారి సలహాపై జపం ప్రారంభించాలి.

ఈ 41 రోజులు దీక్షపూని, సాత్విక ఆహారాన్ని భుజిస్తూ, మితంగా మాట్లాడుతూ ఉండాలి. ఉదయాన్నే చేసే జపం సంఖ్యానియమం కలిగి ఉండాలి. అంటే రోజుకు వెయ్యి చేస్తాననో, రెండు వేలు అనో నియమం పెట్టుకోవాలి. అది ఎట్టి పరిస్థితులలోనూ ఆపకుండా సంఖ్య పూర్తి అయ్యే వరకూ రోజూ చెయ్యాలి. అలాగే మిగతా సమయంలో ( పనులు చేసుకుంటున్నప్పుడు ) కుడా  వీలయినన్ని సార్లు ఆ శ్లోకాన్ని చదువుతూ ఉండాలి. కానీ ఉదయం పూజా స్థలంలో కూర్చుని చదివే సంఖ్య మాత్రమే లెక్కకు వస్తుంది.

ఉదా: శుక్రునికి మొత్తం జప సంఖ్య 20,000 అయితే రోజుకు 1,000 చేస్తాము అన్న నియమంపెట్టుకుంటే మొత్తం జపం 20 రోజులు పడుతుంది. అదే 2 వేలు చేస్తాము అనుకుంటే 10 రోజులలో జపం పూర్తవుతుంది. మీ శక్తిని, సమయాన్ని బట్టి సంకల్పం చేసుకోవాలి.

 ఈ శ్లోక జపం చేసే రోజులలో మనసు జపం పై మరింత లగ్నం అవ్వడానికి ఏదో ఒక పురాణ ప్రవచనాన్ని వినే నియమాన్ని విధించుకోండి.   మీరు జపం చేద్దామని సంకల్పించ గానె పూర్తిచేయలేరు. గ్రహాలు మధ్య మధ్యలో అవాంతరాలు కలిగిస్తాయి. ఆపరీక్షకు తట్టుకుని పూర్తి చేయాలంటే మీ జప దీక్షా సమయంలో నవగ్రహ  ప్రదక్షిణం, గ్రహ జపం, పురాణ కథా శ్రవణం అను మూడూ నిత్యం జరగాలి.  ప్రదక్షిణ, జపం ఉదయం 6 నుండి 8  లోపు పూర్తి చేయాలి. పురాణం సాయంత్రమైనా వినవచ్చు.  ఈ మూడూ ఒకదానికి ఒకటి అవినాభావ సంబంధం కలిగి ఉంటాయి. జపానికి మధ్యలో అవాంతరాలు రాకుండా  మిగతా రెండూ మిమ్మల్ని కాపాడతాయి

నవగ్రహ ప్రసన్న స్తుతులు

జపాకుసుమ సంకాశం ! కాశ్యపేయం మహాద్యుతిం 
తమోరిం సర్వపాపఘ్నం ! ప్రణతోస్మి దివాకరమ్ !!

దధిశంఖ తుషారాభం ! క్షీరోదార్ణవ సంభవం 
నమామి నశినం సోమం ! శంభోర్మకుటభూషణమ్ !!

ధరణీ గర్భ సంభూతం ! విద్యుత్కాంతి సమ ప్రభం 
కుమారం శక్తి హస్తం తం ! మంగళం ప్రణమామ్యహమ్ !! 

ప్రియంగుకలికా శ్యామం ! రూపేణా ప్రతిమం బుధం 
సౌమ్యం సత్త్వగుణోపేతం ! తం బుధం ప్రణమామ్యహమ్ !!

దేవానాం చ ఋషీనాంచ గురుం కాంచన సన్నిభం 
బుద్ధిమంత్రం త్రిలోకేశం ! తం నమామి బృహస్పతిమ్ !!

హిమకుంద మృణాళాభం ! దైత్యానాం పరమం గురుం 
సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహమ్ !!

నీలాంజన సమాభాసం ! రవిపుత్రం యమాగ్రజం 
ఛాయా మార్తాండ సంభూతం ! తం నమామి శనైశ్చరమ్ !!

అర్ధకాయం మహావీరం ! చంద్రాదిత్య విమర్దనం 
సింహికా గర్భసంభూతం ! తం రాహుం ప్రణమామ్యహమ్ !!

ఫలాశ పుష్ప సంకాశం ! తారకా గ్రహ మస్తకం 
రౌద్రం రౌద్రత్మకం ఘోరం ! తం కేతు ప్రణమామ్యహమ్ !!


నవగ్రహ పీడాహర స్తోత్రం 


గ్రహాణామాది రాదిత్యోలోక రక్షణ కారకః

విషయ స్థాన సంభూతాం పీడాం హరతుమే రవి:

రోహిణీ శస్సుధామూర్తి స్సుధాగాత్రస్సురాళనః


భూమిపుత్రో మహాతేజా జగతాం భయకృత్నదా

వృష్టికృదృష్టి హర్తాచ పీడాం హరతు మేకుజః


ఉత్పాత్రూపోజగతాం చంద్రపుత్రో మహాద్యుతిః

సూర్యప్రియకరో విద్వాన్ పీడాం హరతుమే బుధః


దేవమంత్రీ విశాలాక్షః సదాలోకహితేరహః

అనేక శిష్య సంపూర్ణః పీడాం హరతుమే గురుః


దైత్యమంత్రీ గురుస్తేషాం ప్రాణదశ్చమహామతిః

ప్రభుస్తారాగ్రహాణాంచ పీడాం హరతుమే భ్రుగుః


సూర్యపుత్రో దీర్ఘదేహో విశాలాక్ష శివప్రియః

మందచారః ప్రసన్నాత్మా పీడాం హరతుమే శనిః


మహాశ్రీరామ మహావక్త్రో దీర్ఘదంస్త్రో మహాబలః

అతనుశ్చోర్ధ్వకేశశ్చ పీడాం హరతుమే శిఖీ


అనేక రూప్వర్వైశ్చ శతశో ధసహస్రశః

ఉత్పాతరుజోజగతాం పీడాం హరతుమే తమః



(ప్రతిరోజూ ఈ నవగ్రహ పీడా పరిహార స్తోత్రాన్ని ఉదయాన్నే తొమ్మిదిసార్లు పఠిస్తే గ్రహపీడ తొలగి, కార్యసిద్ధి కలుగుతుంది.)

Blog Archive